August salary for teachers in AP is delayed..!
ఏపీలో ఉపాధ్యాయులకు ఆగస్టు నెల జీతం ఆలస్యమే..!
సెప్టెంబరు 2నుంచి జీతాల బిల్లుల సమర్పణకు అవకాశం
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఆగస్టు నెల జీతాలు ఆలస్యం కానున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కేడర్ స్ట్రెంత్ అంశం పూర్తి కానందున జాప్యం జరుగుతోంది. సెప్టెంబరు 2నుంచి జీతాల బిల్లుల సమర్పణకు అవకాశం కల్పించనున్నారు. ఈ లెక్కన బిల్లుల సమర్పణకే రెండు రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాతనే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది. ఆగస్టు నెల జీతం అయిదో తేదీ తర్వాతనే వచ్చే అవకాశం ఉంది.జూన్‌లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, సర్దుబాటు నిర్వహించారు. దీంతో కొన్ని పాఠశాలల్లో పోస్టులు రద్దు కాగా.. మరికొన్నిచోట్ల పోస్టులు పెరిగాయి. అవసరం లేని బడుల నుంచి పోస్టులను అవసరమైన చోటకు బదిలీ చేశారు.ఇలా పోస్టులను మార్చడం వల్ల ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో తెలుపుతూ కేడర్ స్ట్రెంత్‌ను ట్రెజరీ, సీఎఫ్‌ఎంఎస్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ, ఆర్థిక శాఖలోని విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో కేడర్ స్ట్రెంత్ పూర్తి చేసేందుకు సమయం పట్టింది. గత జూన్‌లో బదిలీలు, పదోన్నతులు, సర్దుబాటు కింద కొత్త పాఠశాలలకు వెళ్లిన 30వేల మందికి రెండు నెలలుగా జీతాలు రావడం లేదు. వీరు కాకుండా హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్మీడియట్‌కు బోధిస్తున్న 1,700 మందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు కేడర్ స్ట్రెంత్ పూర్తి చేస్తే ముందుగా ఆగస్టు ఒక్క నెల జీతం మాత్రమే ముందుగా ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండు నెలల జీతం బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది.
0 Response to "August salary for teachers in AP is delayed..!"
Post a Comment