Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC Constable exam 2023 notification: Register for 7547 posts till September 30O

 SSC Constable exam 2023 notification: Register for 7547 posts till September 30SSC Constable exam 2023 notification: Register for 7547 posts till September 30

దేశ రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీ(( Delhi Police Constable Recruitment 2023 ) )కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు : 7547 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా 10+ 2 విద్యార్హత ఉన్న భారతీయ పౌరులందరూ ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 1న ప్రారంభమైంది. అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు:

కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు (జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302)

కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు (జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150)

అర్హత:

10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌(ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి.

జీతం: పే లెవల్-3 (రూ.21,700-రూ.69,100)

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్‌లో 100 మార్కులు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజింగ్‌ తదితర అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: 01-09-2023 నుంచి 30-09-2023 వరకు.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేది: 30-09-2023

దరఖాస్తు సవరణ తేదీలు: 03, 04-10-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2023, డిసెంబర్‌లో

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC Constable exam 2023 notification: Register for 7547 posts till September 30O"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0