LED or CFL? Which bulb is better? What lowers the electricity bill?
LED లేదా CFL? ఏ బల్బు బెటర్? ఏది కరెంటు బిల్లును తగ్గిస్తుంది?
CFLలు, LEDలు ఎలా పనిచేస్తాయో ముందుగా అర్థం చేసుకుందాం. మీరు CFLని ఆన్ చేసినప్పుడు, అతినీలలోహిత కాంతిని విడుదల చేసే రసాయనాలు (ఆర్గాన్, పాదరసం) కలిగిన ట్యూబ్ ద్వారా విద్యుత్ వెళుతుంది.
అప్పుడు మానవ కంటికి కనిపించని ఈ అతినీలలోహిత కాంతి, ట్యూబ్ లోపల ఉన్న ఫ్లోరోసెంట్ కోటింగ్ (ఫాస్ఫర్)ని తాకుతుంది.
కొంత సమయం తర్వాత ఈ ఉత్తేజిత పూత, కనిపించే కాంతిని విడుదల చేస్తుంది. CFLలు ప్రారంభంలో ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. అవి వేడెక్కడానికి ఒకటి లేదా రెండు నిమిషాలు కూడా పడుతుంది. కానీ, అవి కంటిన్యూగా పనిచేస్తున్నప్పుడు, వాటికి సమానమైన ఫిలమెంట్ బల్బు కంటే 70 శాతం దాకా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి.
ఇక LED గురించి మాట్లాడుకుంటే, ఇది కొత్త లైటింగ్ టెక్నాలజీ. LED లను TV, డిజిటల్ గడియారాలు, అనేక పరికరాలలో వాడుతున్నారు. మీరు LEDని ఆన్ చేసినప్పుడు, మీరు డయోడ్ అనే సెమీకండక్టర్ పదార్థం ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని పంపుతారు. సెమీకండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహంలో ఎలక్ట్రాన్లు ప్రవహించినప్పుడు కాంతి ఉత్పత్తి అవుతుంది. సంప్రదాయ బల్బులతో పోలిస్తే ఇవి 90 శాతం వరకు విద్యుత్ ఆదా చేస్తాయి
విద్యుత్ ఆదా విషయంలో ఏది ఉత్తమం?: సాంప్రదాయ బల్బుల కంటే CFLలు, LEDలు రెండూ ఎక్కువ విద్యుత్‌ను ఆదా చేస్తాయి. కానీ, LED ఈ రెండింటిలో అత్యంత సమర్థమైనది. ఎందుకంటే.. CFLలు దాదాపు 25% ఎక్కువ సమర్థమైనవి, LEDలు దాదాపు 75% ఎక్కువ సమర్థమైనవి.
ఏది ఎక్కువ కాలం ఉంటుంది? LEDలు, CFLలు రెండూ ఎక్కువ కాలం ఉంటాయి. కానీ, ఇక్కడ కూడా LEDలు ముందున్నాయి. సాంప్రదాయ బల్బ్ యొక్క జీవితం 1000 గంటలు. అదే CFLలు 10,000 గంటలు, LEDలు దాదాపు 25,000 గంటల జీవితాన్ని కలిగి ఉంటాయి.
మొత్తంమీద, LED లు, CFLల కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. అలాగే, CFLల కంటే LEDలు ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎక్కువ మంచివి. ఐతే.. సంప్రదాయ ఫిలమెంట్ బల్బుల ధరతో పోల్చితే.. LEDలు, CFLల ధరలు దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కరెంటును ఆదా చేస్తాయన్న ఉద్దేశంతో ప్రజలు వీటిని వాడుతున్నారు. కానీ విపరీతమైన ధరల భారం వారికి సమస్య అవుతోంది. తయారీ కంపెనీలు ఈ ధరలను తగ్గిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.
0 Response to "LED or CFL? Which bulb is better? What lowers the electricity bill?"
Post a Comment