Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Mandukasana For Control Diabetes

 Control Diabetes: మండూకాసనంతో మధుహానికి శాశ్వతంగా బైబై

Mandukasana For Control Diabetes

శరీరం తగిన పరిమాణంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల అనేక రాకల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో చాలా మందిలో సాధరణంగా వచ్చే వ్యాధి మధుమేహం.

ఈ వ్యాధి కారణంగా చాలా మందిలో రక్తంలోని చక్కెర పరిమాణాల్లో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. అయితే ఈ చక్కెర పరిమాణాలు తగ్గడం, పెరగడమనేది జీవనశైలి, ఆహారపు అలవాట్లను బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా మంది వైద్యులు మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే మూత్రపిండాలు, చర్మం, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. దీని కారణంగా ప్రాణాంతకంగానూ మరే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి ప్రతి రోజు ఈ కింది ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది.

మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు మండూకాసనం వేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల పొత్తికడుపు కండరాలు దృఢంగా మారడమే కాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మండూకాసనాన్ని బరువు తగ్గాలనుకునేవారు కూడా వేయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆసనాన్ని ఎలా వేయాలో? దీనిని వేయడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మండూకాసనాన్ని ఇలా వేయండి:
మండూకాసనం చేయడానికి..ముందుగా వజ్రాసనంలో కూర్చోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండు చేతులనుయ పిడికిలిగా ముడుచుకోవాలి. కానీ బొటనవేళ్లను మాత్రం బయటికి ఉంచాల్సి ఉంటుంది. పిడికిలి తొడల దగ్గరికి తీసుకుని నాభిపైకి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ముందుకు వంగి..మీ ఛాతీతో మీ తొడలను తాకాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు గాలి పీల్చిని నెమ్మదిగా పిల్చుకుంటూ..బయటకు వదలాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు 3 నుంచి 5 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల రాకుండా ఉంటాయి.

మండూకాసనం వల్ల కలిగే ప్రయోజనాలు:
మండూకాసనం ప్రతి రోజు చేయడం వల్ల పొట్ట భాగం దృఢంగా మారుతుంది.
అంతేకాకుండా గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సులభంగా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గిస్తుంది.
ఈ ఆసనం ప్రతి రోజు వేయడం వల్ల అవయవాలకు మసాజ్‌ అవుతుంది.
డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Mandukasana For Control Diabetes"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0