Teachers are divided over the ban on cell phones
సెల్ ఫోన్ల నిషేధంపై భగ్గుమన్న టీచర్లు
ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని ఉపాధ్యాయుల మండిపాటు
పాఠశా లల్లో సెల్ఫోన్లను నిషేధించడంపై టీచర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒక విధంగా తమను మనోవేదనకు గురిచేసే విధానాలను అమలుచేస్తు న్నదని విమర్శిస్తున్నారు. టీచర్ల సెల్ఫోన్లను నిషే ధించిన ప్రభుత్వం పాఠశాల నుంచి రోజువారీ ఫొటోలు తీసి అప్లోడ్ చేసే విధానాలను మాత్రం ఉపసంహరించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తు న్నారు. తాము పాఠశాలల్లో ఉన్నా తరగతి గదుల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడం లేదని, అటువంటప్పుడు తామేదో తప్పు చేస్తున్నట్లుగా ప్రజల్లో దోషులుగా నిలబెట్టేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రధానోపా ధ్యాయుల వద్ద సెల్ఫోన్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే పాఠశాలల్లో తమకు అప్పగిం చిన పనులను వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. సెల్ఫోన్లు లేకపోతే ఉదయం 9.30 కల్లా పాఠశాలలో ముఖ హాజరు వేయడంతోపాటు పాఠ శాలలో రోజువారీ తీయాల్సిన వివిధ రకాల ఫొటోలు తీసి అప్లోడ్ చేసేందుకు సాధ్యమవు తుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా అత్యవస రంగా ఇంటి నుంచి ఫోన్లు వస్తే తమ పరి స్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సాంకేతి కంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రభుత్వం ఇటు వంటి నిర్ణయాలు తీసు కోవడంపై టీచర్లు మండిపడుతు న్నారు.
0 Response to "Teachers are divided over the ban on cell phones"
Post a Comment