Huge job vacancies in NABARD with degree qualification.. Full details with huge salary.
డిగ్రీ అర్హతతో నాబార్డ్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో పూర్తి వివరాలు.
బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
nabard.org వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెప్టెంబర్ నెల 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2023 సంవత్సరం సెప్టెంబర్ 23 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
మొత్తం 150 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 800 రూపాయలుగా ఉండనుంది.
రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు కేవలం 150 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ నెల 16వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ప్రిలిమనరీ పరీక్షను నిర్వహిస్తారు. జనరల్ ఉద్యోగ ఖాళీలు 77, కంప్యూటర్/ఇన్మర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగ ఖాళీలు 40, ఫైనాన్స్ ఉద్యోగ ఖాళీలు 15 ఉన్నాయి.
కంపెనీ సెక్రటరీ ఉద్యోగ ఖాళీలు 3 ఉండగా సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 3, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 3, జియో ఇన్మోమాటిక్స్ ఉద్యోగ ఖాళీలు 2, ఫారెస్ట్రీ ఉద్యోగ ఖాళీలు 2, ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగ ఖాళీలు 2, స్టాటిస్టిక్స్ ఉద్యోగ ఖాళీలు 2, మాస్ కమ్యూనికేషన్/ మీడియా స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి.అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.
ఖాళీల వివరాలు..
అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఎ) పోస్టులు
మొత్తం ఖాళీలు: 150.
డిపార్ట్మెంట్:రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్.
పోస్టుల కేటాయింపు: యూఆర్-61, ఎస్సీ-22, ఎస్టీ-12, ఓబీసీ-41, ఈడబ్ల్యూఎస్-14.
విభాగాలు:జనరల్, కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫారెస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్టాటిస్టిక్స్, మాస్ కమ్యూనికేషన్/ మీడియా స్పెషలిస్ట్.
అర్హత:పోస్టును అనుసరించి 60% మార్కులతో జనరల్ డిగ్రీ, సంబంధింత విబాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్ఏ, ఏసీఎంఏ, ఎఫ్సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.09.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం:ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం:నెలకు రూ.44,500 నుంచి రూ.89,150.
ముఖ్యమైన తేదీలు.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 02-09-2023
దరఖాస్తు స్వీకరణకు చివరి తేది: 23-09-2023
ఫేజ్-1 (ప్రిలిమినరీ)-ఆన్లైన్ పరీక్షతేదీ: 16.10.2023.
0 Response to "Huge job vacancies in NABARD with degree qualification.. Full details with huge salary."
Post a Comment