Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AIIMS Bhopal Non Teaching Recruitment 2023

 AIIMS Bhopal Non Teaching Recruitment 2023  


ఎయిమ్స్‌ భోపాల్‌ 233 గ్రూప్‌-సీ నాన్‌ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో.. సోషల్‌ వర్కర్‌-2, ఆఫీస్‌/స్టోర్స్‌ అటెండెంట్‌ (మల్టీటాస్కింగ్‌)-40, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-32, స్టెనోగ్రాఫర్‌-34, డ్రైవర్‌-16 (ఆర్డినరీ గ్రేడ్‌), జూనియర్‌ వార్డెన్‌-10 (హౌస్‌ కీపర్‌), డిసెక్షన్‌ హాల్‌ అటెండెంట్స్‌-8, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌-2, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎ-2, జూనియర్‌ స్కేల్‌ స్టెనో (హిందీ)-1, సెక్యూరిటీ కమ్‌ ఫైర్‌ జమదర్‌-1, స్టోర్‌ కీపర్‌ కమ్‌ క్లర్క్‌-85 ఉన్నాయి.

అర్హతలు- ఇతర సమాచారం :

సోషల్‌వర్కర్‌: 10+2 పాసై, 8 ఏళ్ల అనుభవం.. వయసు 18-35 మధ్య ఉండాలి

ఆఫీస్‌/స్టోర్స్‌ అటెండెంట్‌ (మల్టీటాస్కింగ్‌): పదోతరగతి, ఐటీఐ పాసవ్వాలి. వయసు 30 ఏళ్లకు మించకూడదు.

లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: ఇంటర్మీడియట్‌/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు/హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్‌ చేయగలగాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నవారికి ప్రాధాన్యం. వయసు 18-30.

స్టెనోగ్రాఫర్‌: ఇంటర్మీడియట్‌/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. స్కిల్‌ టెస్ట్, 10 నిమిషాల డిక్టేషన్‌ ఉంటుంది. ఈ మేటర్‌ను ఇంగ్లిష్‌లో 50 నిమిషాలు/ హిందీలో 65 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌పై టైప్‌ చేయాలి. వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టోర్‌ కీపర్‌ కమ్‌ క్లర్క్‌: డిగ్రీ పాసై .. స్టోర్స్‌ నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి. మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 30 మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు. ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అయితే దరఖాస్తులో సమయంలోనే పోస్టుల ప్రాధాన్యాన్ని తెలియజేయాలి. ఆ తర్వాత దీంట్లో ఎలాంటి మార్పులు చేయడానికీ అవకాశం ఉండదు. ప్రతి పోస్టుకూ వేర్వేరుగా ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం : కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ పరీక్ష పాసైన అభ్యర్థులకు పోస్టును బట్టి స్కిల్‌ టెస్ట్‌ కూడా నిర్వహిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ : అక్టోబర్‌ 30, 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aiimsbhopal.edu.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AIIMS Bhopal Non Teaching Recruitment 2023"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0