How did Devi Navratras begin?
దేవీ నవరాత్రులు ఏవిధంగా ఆరంభమయ్యాయి.
దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్న సందర్భంగా మణిద్వీపములో చింతామణి గృహంలో కామేశ్వరీ, కామేశ్వరులిరువురు ఆనంద పరవశులైవున్న సమయంలో సకల దేవగణ, ఋషిగణ, యోగినీ గణాదులు మహాకామేశ్వరుణ్ణి ప్రార్జించి, స్వామి!
మిమ్ములను పగటికాలమందు అమ్మను రాత్రికాలమందు ఆరాధిసూ తరిస్తున్నాము. ఒక్క రాత్రికాలమందైనా తమరిని ఆరాధించాలనేటటువంటి కోరిక కలుగుతోంది అనుగ్రహించండి స్వామీ! అని వేడుకున్నారు.
భక్తవశంకరుడైన మహాకామేశ్వరుడు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్ధశినాటి రాత్రికాలము మీకు అనుగ్రహిస్తున్నానని వరప్రదానం చేశాడు. ప్రక్కనే వున్న మహాకామేశ్వరీ అయిన మహాత్రిపుర సుందరి నా స్వామి నన్ను నిర్లక్ష్యంచేసి,
నా అనుమతిలేకనే నా కాలమైన రాత్రికాలాన్ని తమ పూజ చేయుటకు అనుగ్రహించి, నన్నవమానించాడు. అవమానానికి తట్టుకోలేని మహా కామేశ్వరి మహాకాళీ రూపాన్ని దాల్చి,
అనంతవిశ్వాన్ని బ్రిమింగేస్తానని చెప్పి శపథాలు చేసూ, ఉగ్రరూపిణియై, బిల్వవృక్షాన్ని ఎక్కి కూర్చొని వికటాట్టహాసాలు చేస్తోంది.
అమ్మ ఉగ్రరూపానికి లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. సర్వగణాలు మహాకామేశ్వరునివద్దకు పోయి స్వామీ! ఏమిటీ లీల! మేము మా ఆనందం కోసం మిమ్మల్ని రాత్రికాలంలో ఆరాధించాలని అడిగామనుకోండి.
తమరు ప్రక్కనే వున్న అమ్మ అనుజ్ఞ లేకుండా ఏవిధంగా మాకు అనుజ్ఞ ఇచ్చారు. అమ్మవారికెందుకంత కోపం వచ్చింది. ఆ కోపాన్ని తగ్గించే ఉపాయాన్ని మీరే అనుగ్రహించాలని వేడుకొన్నారు.
చిరునవ్వులు చిందిస్తూ మహా కామేశ్వరుడు అమ్మవారి ఉగ్రరూపాన్ని స్తోత్రాదులతోశాంతింపచేయమనిఆదేశించాడు. వారు ఆరుపగళు, ఆరురాత్రు ళ్ళుఅమ్మవారియొక్కఉగ్రతత్వాన్ని శాంతింపచేసేందుకు ప్రయత్నం చేసి విఫలురై మహా కామేశ్వరుణ్ణి ఆశ్రయించారు.
మహాకామేశ్వరుడు కూడా అమ్మ ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు పరిపరి విధాల మూడు రాత్రుళు, మూడు పగళు ప్రయత్నించాడు. అయినప్పటికీ అమ్మ కోపం వృద్ధి అవుతోందే కానీ, తగ్గుముఖం పట్టలేదు.
మహాకామేశ్వరి, మహాత్రిపుర సుందరి నీ అనుజ్ఞ లేక నీ కాలమైన రాత్రికాలంలో నన్ను ఆరాధించుటకు అవకాశమిచ్చినందులకు గాను ఈ తొమ్మిది రాత్రుళ్లు, పది పగళ్లు నీయొక్క ఆరాధనకే అవకాశమిస్తున్నాను.
శాంతించి బిల్వవృక్షం దిగివచ్చి లోకాలను ఉద్ధరించు అని ప్రార్థించాడు. అప్పడు ఉగ్రకాళీ రూపాన్ని ఉప సంహరించుకొని కామేశ్వరిగా, మహాకామేశ్వరుణ్ణి చేరింది.
ఈ నవరాత్రులలో అమ్మకు ప్రియమైన, అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో, హరిద్ర కుంకుమ పుష్పాదులతో, సాంబ్రాణి ఉగ్గులను, అగరు ధూపాలతోఅమ్మవారినిసేవించిన సంపూర్ణ ఆయురారోగ్యములు వృద్ధి చెందును.
0 Response to "How did Devi Navratras begin?"
Post a Comment