AP DSC 2023 : First TET in AP. After that Minister Botsa gave DSC clarity
AP DSC 2023 : ఏపీలో మొదట TET. ఆ తర్వాత DSC క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ
AP TET Notification 2023 : ఏపీలో మొదట టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఆ తర్వాత డీఎస్సీపై ప్రకటన చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
AP DSC 2023 - AP TET : ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. ఏపీ డీఎస్సీ (AP DSC 2023)పై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందన్నారు. డీఎస్సీపై సీఎం దగ్గర చర్చ జరుగుతోందని.. ముందు టెట్ (AP TET).. ఆ తర్వాత డీఎస్సీ (AP DSC) నిర్వహిస్తామని వెల్లడించారు. యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,200కి పైగా పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. 18 ఏళ్ల నుండి యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదు. పాఠశాలల్లో ఖాళీలన్నింటిని గుర్తించామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
పలు అంశాలపై మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. విద్యా శాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ తొలి ప్రాధాన్యత విద్యారంగమని.. ఈ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. అలాగే.. బైజూస్ కంటెంట్ ఫ్రీగానే ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. అందులోనూ బైజూస్ కంటెంట్ పెట్టి ఇచ్చాం. దానికి కూడా బైజూస్‌కి ఒక రూపాయి చెల్లించలేదు. అతని వ్యాపారాలతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పిల్లలకు మంచి ఇంగ్లీష్ నేర్పడం కోసం టోఫెల్‌ను తీసుకొచ్చామని వెల్లడించారు.
ఇక.. టోఫెల్ శిక్షణ కోసం పెట్టే టెస్ట్‌కి ఒక్కో విద్యార్థికి రూ.7.50 పైసలు మాత్రమే ఫీజు. సుమారు 20 లక్షల 75 వేల మందికి ప్రభుత్వం ఆ ఫీజు చెల్లించింది. టోఫెల్ టెస్ట్‌లో పాస్ అయిన వారికి మాత్రమే టెస్ట్‌కి రూ.600 ఫీజు తీసుకుంటారు. మొత్తం కలిపి రూ.6 కోట్లు మాత్రమే టోఫెల్ టెస్ట్‌ల కోసం ఖర్చుపెట్టామన్నారు.
0 Response to "AP DSC 2023 : First TET in AP. After that Minister Botsa gave DSC clarity"
Post a Comment