Are these transactions beyond the limits? Beware of tax notices.
Tax Notice: లిమిట్స్ దాటి ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా.? పన్ను నోటీసులొస్తాయ్ జాగ్రత్త.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చెల్లింపులు పూర్తిగా డిజిటలైజేషన్ అవుతున్నాయి. దీంతో ఖర్చుచేసే ప్రతిరూపాయి ప్రభుత్వానికి లెక్కలు చేరుతున్నాయి.
కాబట్టి పరిమితులకు మంచి చేసే ట్రాన్సాక్షన్లకు లెక్కలు చెప్పాల్సిందే టాక్స్ కట్టాల్సిందే.
చాలా మంది తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఐటీ శాఖ నుంచి నోటీసులు రావటంతో పాటు జైలు శిక్ష లేదా జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. అందుకే ముందుగా పన్ను శాఖ నిర్థేశించిన ట్రాన్సాక్షన్ పరిమితుల గురించి ఓ లుక్కేయండి.
ఆస్థుల క్రయవిక్రయాలు : ఎవరైనా వ్యక్తి రూ.30 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కొన్నా లేకపోతే అమ్మినా సదరు లావాదేవీల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ పన్ను శాఖకు తెలియజేస్తుంది. అందువల్ల పెద్ద మెుత్తాలతో ఇళ్లు, పొలాలు, స్థలాలు, అపార్ట్మెంట్స్ వంటి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్లు చేసేవారు తప్పకుండా ఐటీ అధికారుల రాడార్ లో ఉంటారని గుర్తుంచుకోవాలి. వీటిని సదరు వ్యక్తుల ఐటీ రిటర్న్స్ లో క్రాస్ వెరిఫై చేస్తుంది. కాబట్టి వీటి వివరాలు మిస్ కాకుండా రిటర్న్ దాఖలులో వెల్లడించటం ఉత్తమం.
క్రెడిట్ కార్డ్ బిల్లులు : ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం రికార్డు స్థాయిలకు చేరుకుంటోంది. చాలా మంది ఇతరుల కోసం కూడా తమ కార్డులను ఇస్తున్నారు. ఎవరైనా కార్డుదారు ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించినట్లయితే ఆ వివరాలను ఫైనాన్స్ సంస్థలు పన్ను శాఖకు అందిస్తాయని గుర్తుంచుకోండి. మీ పాన్ వివరాలతో ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేస్తూనే ఉంటాయి.
సేవింగ్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ : ఆర్థిక సంవత్సరంలో సేవింగ్ అకౌంట్ లో మెుత్తం ట్రాన్సాక్షన్ల విలువ రూ.10 లక్షలకు మించితే వాటి వివరాలను తప్పకుండా ఐటీ అధికారులు పరిశీలిస్తారు. ఇదే క్రమంలో వ్యాపారులు వినియోగించే కరెంట్ అకౌంట్ లో ఏడాదిలో రూ.50 లక్షలకు మించి జరిగే లావాదేవీలను పరిశీలిస్తారు. ఇదే క్రమంలో రూ.10 లక్షలకు మించి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా పన్ను అధికారుల పరిశీలన తప్పకుండా ఉంటుంది.
పెట్టుబడులు : ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్న ఐటీ అధికారులు మనం చేసే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ వంటి పెట్టుబడుల విషయంలో రూ.10 లక్షలకు మించి చేసే ట్రాన్సాక్షన్లను పరిశీలిస్తారు. దీనికి తోడు విదేశీ కరెన్సీల్లో రూ.10 లక్షలకు మించి చేసే అన్ని ట్రాన్సాక్షన్ల విషయంలో వివరాలు అందించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపులకు రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో పైన పేర్కొన్న ట్రాన్సాక్షన వివరాలు అందించక పోతే తప్పకుండా నోటీసులు వస్తాయి. వీటికి సంబంధించి ఆదాయ వనరులను సంబంధిత రుజువులను టాక్స్ పేయర్స్ చూపించాల్సి ఉంటుంది. విఫలమైతే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
0 Response to "Are these transactions beyond the limits? Beware of tax notices."
Post a Comment