Brothers who got group 1 jobs in the same house.. They are really great.
ఒకే ఇంట్లో గ్రూప్1 ఉద్యోగాలు సాధించిన అన్నాదమ్ములు.. వీళ్లు నిజంగా గ్రేట్.
గ్రూప్1 పరీక్షలో( Group-1 ) మంచి ర్యాంక్ సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే. ఎంతో కష్టపడితే మాత్రమే గ్రూప్1 పరీక్షలో సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 111 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశారు. శ్రీకాకుళంకు చెందిన సాయిరాజేష్,( Sai Rajesh ) సాయిమనోజ్( Sai Manoj ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది. బీటెక్ పూర్తి చేసిన అన్నాదమ్ములు ఏడేళ్లు ఢిల్లీలో శిక్షణ తీసుకుని గ్రూప్1 పరీక్షలో ఒకే సమయంలో అదిరిపోయే ఫలితాలను సాధించి ఉద్యోగం సాధించడం గమనార్హం. ఒకే కుటుంబంలో ఇద్దరూ మంచి ఫలితాలను సాధించడం కుటుంబ సభ్యులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
సాయి రాజేష్, సాయి మనోజ్ తల్లి ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తుండగా తండ్రి ఉమా మహేశ్వరరావు( Uma Maheshwara Rao ) బీసీ సంక్షేమశాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. మొత్తం 111 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా వీరిలో 33 మంది మహిళలు ఉండటం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలలో ఒక ఖాళీని స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
గ్రూప్1 జాబ్ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ కలెక్టర్, సీటీవో, డీఎస్పీ సివిల్, డీఎస్పీ జైళ్లు, డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్, ఏటీవో ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగులు ఎంతగానో సంతోషిస్తున్నారు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. సాయిరాజేశ్, సాయిమనోజ్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. సాయిరాజేశ్, సాయిమనోజ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.
0 Response to "Brothers who got group 1 jobs in the same house.. They are really great."
Post a Comment