whatsapp new feature.. no one can see your secret chats
Whatsapp కొత్త ఫీచర్.. మీ సీక్రెట్ చాట్‌లు ఎవరికీ కనిపించవు
మోటా నేతృత్వంలోని వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారుల భద్రత, సౌకర్యాల కోసం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత కొన్ని నెలలుగా కీలక ఫీచర్లను విడుదల చేస్తోంది.
తాజాగా లాక్ చేసిన చాట్‌ను మరింత గోప్యంగా ఉంచుకొనే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం.
ఈ Locked Chat ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు సీక్రెట్ కోడ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వాట్సాప్‌లో చాట్‌లాక్ (Whatsapp Chat lock) ఫీచర్ ద్వారా లాక్ చేసిన చాట్‌ను అందరూ యాక్సెస్ చేయలేరు. కానీ ఆ జాబితాలోని వివరాలు తెలియకపోయినా.. అక్కడ కొన్ని చాట్‌లను లాక్ చేసినట్లు మాత్రం ఇతరులకు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే త్వరలో రానున్న ఈ ఫీచర్‌తో లాక్ చేసిన చాట్ అసలు చాట్ లిస్ట్‌లో కనిపించదని తెలుస్తోంది. వినియోగదారుడు పూర్తిగా ఈ చాట్‌ను ఎవరికీ కనిపించకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది.
సీక్రెట్ కోడ్ : సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే చాట్ లాక్‌లో ఉన్న కాంట్రాక్ట్‌లు కనిపిస్తాయి. ఫలితంగా వాట్సాప్ యూజర్‌కు వ్యక్తిగత సమాచారానికి మరింత మెరుగైన భద్రత లభిస్తుందని వాట్సాప్ భావిస్తున్నట్లు సమాచారం. అంటే చాట్ లాక్‌ను యాక్సెస్ చేసేందుకు మరో సీక్రెట్ కోడ్ అవసరం కానుంది. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
దీంతోపాటు పాస్‌కీస్ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఫలితంగా ఓటీపీ, SMS వంటి అవసరం లేకుండా ఫింగర్ ఫ్రింట్, ఫేస్, పిన్ సాయంతో వాట్సాప్‌ను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫలితంగా నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో వాట్సాప్ తెరిచేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరియు పాస్‌కీస్ ద్వారా మరింత మెరుగైన భద్రత లభిస్తుంది.
దీంతోపాటు ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్ ఖాతాలను (Dual Whatsapp Accounts Feature) వినియోగించుకొనేందుకు వీలుగా మరో ఫీచర్‌ను ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది క్లోన్ లేదా ఇతర థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్ ఖాతాలను వినియోగిస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వాటి అవసరం లేకుండా.. ఒకే యాప్ నుంచి రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను వినియోగించుకోవచ్చు.మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ కొత్త ఫీచర్‌పై గురువారం కీలక ప్రకటన చేశారు. ఒకే యాప్ ద్వారా రెండు వాట్సాప్ ఖాతాలను నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. త్వరలోనే డ్యూయల్ వాట్సాప్ అకౌంట్ ఫీచర్ వినియోగదారులు అందరికి అందుబాటులోకి వస్తుందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.
ఒకే యాప్‌తో రెండు అకౌంట్లు : కొంత మంది వ్యక్తిగత లేదా అధికారిక నంబర్లను వినియోగిస్తుంటారు. అయితే వారు రెండో నంబర్‌తో వాట్సాప్‌ను వినియోగించాలంటే మొదటి అకౌంట్‌ను లాగ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ కొత్తగా తీసుకురానున్న ఫీచర్‌తో స్విచ్చింగ్ మోడ్‌లో రెండు వాట్సాప్ ఖాతాలను ఒకేసారి వినియోగించుకోవచ్చు.
డ్యూయల్ వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించేందుకు మీరు ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ రెండు సిమ్ కార్డులను (ఫిజికల్ కార్డు లేదా ఈ-సిమ్) సపోర్టు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఒకే యాప్‌లో రెండు అకౌంట్లను వినియోగించేందుకు వీలు ఉంటుంది. రెండో సిమ్ కార్డు నుంచి కూడా SMS వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.
అయితే ఈ డ్యూయల్ వాట్సాప్ అకౌంట్ ఫీచర్ కొన్ని రోజులు లేదా వారాల్లో వినియోగదారులు అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీనిపై వాట్సాప్ అధికారిక ప్రకటన చేసింది. అయితే తేదీపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఈ కింది విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
0 Response to "whatsapp new feature.. no one can see your secret chats"
Post a Comment