Mobile Phone: If the phone does not work, it is usual to give it to the service center.. But if you do not take these 5 precautions, you will lose a lot
Mobile Phone: ఫోన్ పనిచేయకుంటే సర్వీస్ సెంటర్లో ఇవ్వడం మాములే.. కానీ ఈ 5 జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు.
బ్యాటరీ పాడైపోవడం, కెమెరా పనిచేయకపోవడం, స్పీకర్లు పనిచేయకపోవడం, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ మొదలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్బాలలో మొబైల్ రిపేర్ కోసం ఖచ్చితంగా మొబైల్ సర్వీస్ సెంటర్లను సందర్శిస్తుంటారు. ఇలా సర్వీస్ సెంటర్లో మొబైల్ ఇచ్చేటప్పుడు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుంది. సర్వీస్ సెంటర్లో మొబైల్ ఇచ్చేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో పూర్తీగా తెలుసుకుంటే.
ఫోన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హడావిడిగా సర్వీస్ సెంటర్(mobile service center) కు వెళ్లి వాళ్ల చేతుల్లో మొబైల్ పెట్టేస్తుంటారు చాలామంది. ఎంత తొందరగా దాన్ని సరిచేయించుకుందామనే యావే తప్ప మొబైల్ ప్రాబ్లమ్ గురించి పూర్తీగా ఆలోచించరు. ఇంటి దగ్గరే మొబైల్ పనిచేయడంలో ఎదురైన ఇబ్బందులను అన్నింటిని ఒక లిస్ట్ గా రాసుకుని తీసుకెళితే రిపేర్ చేయించుకోవడం సులువు అవుతుంది. మెకానిక్ లకు కూడా సమస్య ఏంటో సులువుగా అర్థమవుతుంది. దీనివల్ల సర్వీసింగ్ ఖర్చు కూడా కాస్త తగ్గుతుంది.
మొబైల్ రిపేర్ చేయించుకున్న తరువాత చాలామంది వారు చెప్పినంత డబ్బును ఇచ్చేసి వస్తుంటారు. మొదట మొబైల్ పనిచేయకపోవడానికి కారణం ఏంటో అడగాలి. కొన్ని సార్లు మొబైల్ లో సాప్ట్వేర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సాఫ్ట్వేర్ మార్చినప్పుడు, మొబైల్ లో ఏవైనా భాగాలు మార్చినప్పుడు దానికి తగిన బిల్(servicing bill) అడిగి తీసుకోవాలి.
మొబైల్ ఫోన్ పాడయ్యిందంటే ఎక్కడలేని కంగారు వస్తుంది. దాన్నితొందరగా రిపేర్ చేయించుకోవాలనే కంగారులో మొబైల్ లో సిమ్ కార్డ్, మెమరీ కార్డ్(sim card, memory card) అలాగే ఉంచేసి సర్వీస్ సెంటర్లో ఇస్తుంటారు. సిమ్, మెమరీ కార్డ్ అలా వారిదగ్గరే ఉంచడం వల్ల వ్యక్తిగత సమాచారానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
మొబైల్ సర్వీస్ సెంటర్లో ఇచ్చినప్పుడు చాలాసార్లు డేటా పోతుంటుంది. అందుకే మొబైల్లో ఉండే కాంటాక్ట్స్, ఫోటోస్, ఫైల్స్, ఇతర డేటాను బ్యాకప్ పెట్టుకోవాలి. ల్యాప్టాప్, ఇతర ఫోన్, హార్డ్ డిస్క్, మెమరీ కార్డ్ లేదా గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ (data backup)పెట్టుకోవాలి. ఈ డేటా విషయంలో సర్వీస్ సెంటర్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. వీలైన వరకు దగ్గరే ఉండి మొబైల్ రిపేర్ చేయించుకుంటే మంచిది.
అన్నింటికంటే ముఖ్యంగా మొబైల్ ఫోన్ ను రిపేర్ కు ఇచ్చేముందు సర్వీస్ సెంటర్ గుర్తింపు పొందినదేనా లేదా అనే విషయం కనుక్కోవాలి. చాలావరకూ సర్వీస్ సెంటర్లు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రన్ చేస్తుంటారు. ముందు వెనుకా ఆలోచించకుండా ఎక్కడపడితే అక్కడ మొబైల్ సర్వీసింగ్ కు ఇవ్వకూడదు.
0 Response to "Mobile Phone: If the phone does not work, it is usual to give it to the service center.. But if you do not take these 5 precautions, you will lose a lot"
Post a Comment