Another thunderbolt on teachers
ఉపాధ్యాయులపై మరో పిడుగు
- విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై టీచర్ల ధ్రువీకరణ తప్పనిసరి!
- పిల్లలు రాణించకపోతే ఉపాధ్యాయులే బాధ్యులు
- మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తరగతుల వారీగా సామర్ధ్యాలు సాధించినట్లు ఉపాధ్యాయులు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలనే నిబంధ నను ప్రభుత్వం తీసుకురాబోతోంది. తరగతికి సంబంధిం చిన అభ్యసన సామర్థ్యాలను తన విద్యార్థులు సాధించి నట్లు ఉపాధ్యాయులే ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరులోపు టీచర్లు స్వీయ ధ్రువపత్రాలను మండల, డిప్యూటీ విద్యాధికారు లకు సమర్పించాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులు తెలుగు, ఆంగ్ల భాషల్లో చదవడం, రాయడంతో పాటు గణితంలో అభ్యసన సామర్థ్యాలను సాధించాల్సి ఉంటుంది. పైతరగతులకు వెళ్లేటప్పుడు కింది తరగతి అంశాలు నేర్చుకున్నట్లు ఉపాధ్యాయులు ధ్రువీకరించాలి. వాటిలో విద్యార్థులు వెనుకంజలో ఉంటే ఉపాధ్యాయులనే బాధ్యుల్ని చేసే అవకాశం ఉంది. ఇప్ప టికే చిత్తూరు జిల్లా విద్యాధికారి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. మిగతా జిల్లా విద్యాధికారులూ స్వీయ ధ్రువీకరణ పత్రాల సేకరణపై కసరత్తు చేస్తున్నారు.
వలస వెళ్లిన వారు ఎలా నేర్చుకుంటారు?
రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వలస వెళ్లారు. కర్నూలు జిల్లాలో చాలాచోట్ల బడులు ఖాళీ అయ్యాయి. వీరి కోసం ప్రత్యేకంగా సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. విద్యార్థులు తిరిగొచ్చినా అప్పటికే నేర్చుకున్న పాఠాలు మర్చిపోతారు. ఇలాంటి విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను ఎలా సాధిస్తారు?
రాష్ట్రంలో 9,602 ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశా లలు ఉన్నాయి. అంటే 1నుంచి 5 తరగతుల వరకూ ఒక్కరే బోధిస్తున్నారు. దీనికితోడు మధ్యాహ్న భోజనం,మరుగుదొడ్ల ఫొటోలు, విద్యా కానుక బయోమెట్రిక్ వంటి బోధనేతర పనులనూ ఆ ఉపాధ్యాయుడే చేయాలి. మరోవైపు ప్రభుత్వం సంస్కరణల పేరుతో టీచర్లను తగ్గించి, ఉన్నవారికి బోధనేతర పనులు అప్పగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు అభ్యసన సామర్థ్యాలు సాదించలేదని ఉపాద్యాయులను బాధ్యులు చేయడమేం టని అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ఉపాధ్యాయులపై కక్ష సాధింపా?
ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. అధికారుల తనిఖీల్లో ఏ చిన్న లోపం కనిపిం చినా ఛాయెమ్మెలు, షోకాజ్ నోటీసులు జారీ చేస్తు న్నారు. ఇంక్రిమెంట్లు, పదోన్నతులపై ప్రభావం చూపేలా నోటీసులు ఇస్తున్నారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలతో మండల, డిప్యూటీ, జిల్లా విద్యాధికారులు తనిఖీల పేరుతో క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. వర్బుక్లలు, నోటుపుస్తకాలు దిద్దకపో యినా నోటీసులిస్తున్నారు. మరోపక్క సమస్యలు పరి ష్కరించాలని ఆందోళనకు పిలుపునిస్తే అరెస్టులు చేయడం, బైండోవర్ కేసులతో ప్రభుత్వం వేధిస్తోంది. ఇప్పుడు స్వీయ ధ్రువపత్రాలంటూ హడావుడి చేస్తోంది.
0 Response to "Another thunderbolt on teachers"
Post a Comment