What courses should be studied to become a homeopathic doctor..? What are the qualifications?
హోమియోపతి డాక్టర్ అవ్వాలంటే ఏ కోర్సులు చదవాలి..? అర్హతలు ఏంటి?
వైద్య రంగంలో వివిధ రకాల వైద్య పద్దతులు ఉన్నాయి. అత్యంత ప్రజాదరణ పొందినవి అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి (Homoeopathi) మాత్రమే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధుల నుంచి ఉపశమనం కల్పించడం హోమియోపతి ప్రత్యేకత.
ప్రపంచవ్యాప్తంగా 84 దేశాలు వ్యాధుల చికిత్సకు హోమియోపతి వైద్యాన్ని అనుసరిస్తున్నాయి. మనదేశంలో 19వ శతాబ్దం నుంచి ఈ వైద్యం ప్రజాదరణ పొందింది.
ప్రస్తుతం అల్లోపతి వైద్యం ఆధిపత్యం చెలాయిస్తున్నా, ఇప్పటికీ హోమియోపతి అనుసరించేవారు చాలా మంది ఉన్నారు. ఈ విధానంలో రోగాలను నయం చేయడానికి ద్రవం, మాత్రల రూపంలో మెడిసిన్ ఉంటాయి. అసలు హోమియోపతి డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ఎలాంటి కోర్సులు చేయాలో తెలుసుకుందాం.
కోర్సు వ్యవధి
హోమియోపతి వైద్యుడిగా స్థిరపడాలంటే ఇంటర్ తరువాత BHMS చదవాలి. బీహెచ్‌ఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. కోర్సు మొత్తం వ్యవధి ఐదున్నర సంవత్సరాలు. ఇందులో నాలుగున్నరేళ్లు కాలేజీలో చదవాలి, ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ కోర్సులో వివిధ రకాల వ్యాధులకు హోమియోపతి చికిత్స పద్దతుల గురించి విద్యార్థులకు బోధిస్తారు. హోమియోపతితో పాటు ఫార్మసీ, హ్యూమన్ అనాటమీ, బయోకెమిస్ట్రీ వంటి సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తారు.
BHMS అర్హత ప్రమాణాలు
BHMS కోర్సు చదవాలంటే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పాసై ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 5శాతం సడలింపు ఉంటుంది. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ తప్పసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలి. BHMS కోర్సులో ప్రవేశం పొందాలంటే, జాతీయ స్థాయిలో జరిగే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే కొన్ని కాలేజీలు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను, మరికొన్ని సొంతంగా ప్రవేశ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంటుంది. అభ్యర్థి కనీస వయసు 17 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసుపై పరిమితి లేదు.
ఫీజు
బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS) కోర్సు చదవాలంటే ఫీజు భారీగా ఉంటుంది. నెలకు రూ.30,000 నుంచి సంవత్సరానికి రూ.4 లక్షల వరకు ఉండవచ్చు. అయితే ఫీజు అనేది ఇన్‌స్టిట్యూట్‌పై ఆధారపడి ఉంటుంది.
టాప్ 10 కాలేజీలు
BHMS కోర్సును ఆఫర్ చేస్తున్న టాప్-10 కాలేజీలు, అవి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు చూద్దాం.
- పూణేలోని డాక్టర్. డీవై పాటిల్ విద్యాపీఠ్ ఇన్‌స్టిట్యూట్ BHMS కోర్సు కోసం రూ.8.55 లక్షల ఫీజు వసూలు చేస్తుంది. ఇంటర్‌లో 50 శాతం మార్కులు వస్తే ఇందులో సీట్ పొందవచ్చు.
- న్యూఢిల్లీలోని జీజీఎస్‌ఐపీయూ కాలేజీ రూ.85,000 ఫీజు వసూలు చేస్తుంది. నీట్ ద్వారా బీహెచ్ఎంఎస్‌లో ప్రవేశం కల్పిస్తోంది.
- కోల్‌కతాలోని ఎన్‌ఐహెచ్ రూ.1.04 లక్షల ఫీజుకు బీహెచ్‌ఎంఎస్ కోర్సును ఆఫర్ చేస్తుంది. నీట్ క్వాలిఫై తప్పనిసరి.
- పూణేలోని లోకమాన్య హోమియోపతిక్ మెడికల్ కాలేజీ రూ. 5.63 లక్షల ఫీజు వసూలు చేస్తుంది. నీట్ ఉత్తీర్ణత సాధించాలి.
- వైబీఎన్ యూనివర్సిటీ-రాంచీ, రూ.4 లక్షల ఫీజుతో బీహెచ్‌ఎంఎస్ కోర్సును ఆఫర్ చేస్తోంది. నీట్ క్వాలిఫై తప్పనిసరి.
- గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్-బెంగళూరు- రూ.1.13 లక్షల ఫీజు, తాంతియా యూనివర్సిటీ-శ్రీ గంగానగర్- రూ.1.60 లక్షలు, పారుల్ యూనివర్సిటీ-వడోదరా- రూ.5.40 లక్షలు, ఆర్‌కేడీఎఫ్
- యూనివర్సిటీ-భోపాల్ రూ.6.12 లక్షల ఫీజు వసూలు చేస్తున్నాయి. ఈ కాలేజీల్లో బీహెచ్ఎంఎస్ కోర్సులో ప్రవేశం పొందాలంటే నీట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
0 Response to "What courses should be studied to become a homeopathic doctor..? What are the qualifications?"
Post a Comment