AP Animal Husbandry Dept. 1896 Animal Husbandry Assistant Posts
AP Animal Husbandry Dept. 1896 Animal Husbandry Assistant Posts
ఏపీ పశుసంవర్ధక శాఖలో 1,896 పశుసంవర్ధక సహాయకుల పోస్టులు - వేతనం: నెలకు రూ.22,460 - రూ. 72,810.
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ- ఏపీ పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసెస్లో రెగ్యులర్ ప్రాతిపదికన 1,896 పశుసంవర్ధక సహాయకులు (ఏహెచ్ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
పశుసంవర్ధక సహాయకులు: 1,896 పోస్టులు
ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీలు
1. అనంతపురం- 473
2. చిత్తూరు- 100
3. కర్నూలు- 252
4. వైఎస్ఆర్ కడప- 210
5. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు - 143
6. ప్రకాశం- 177
7. గుంటూరు- 229
8. కృష్ణా- 120
9. పశ్చిమ గోదావరి- 102
10. తూర్పు గోదావరి- 15
11. విశాఖపట్నం- 28
12. విజయనగరం- 13
13. శ్రీకాకుళం - 34
అర్హతలు: పాలిటెక్నిక్ కోర్సు (యానిమల్ హస్బెండరీ). లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు (డెయిరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్సెస్). లేదా బీఎస్సీ/ ఎంఎస్సీ (డెయిరీ సైన్స్) లేదా డిప్లొమా (వెటర్నరీ సైన్స్/ డెయిరీ ప్రాసెసింగ్). లేదా బీటెక్ (డెయిరీ టెక్నాలజీ) లేదా బీ ఒకేషనల్ కోర్సు (డెయిరీయింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ) ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు అయిదేళ్లు, పీహెచ్/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, గోపాలమిత్ర/ గోపాలమిత్ర సూపర్వైజర్గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజ్ తదితరాల ఆధారంగా.
వేతనం: నెలకు రూ.22,460 - రూ. 72,810.
దరఖాస్తు ఫీజు: రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.500.
ముఖ్యమైన తేదీలు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20-11-2023
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-12-2023.
ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 11-12-2023.
హాల్ టికెట్ల విడుదల తేదీ: 27-12-2023
పరీక్ష తేదీ: 31-12-2023
WEBSITE : https://apaha-recruitment.aptonline.in/
0 Response to "AP Animal Husbandry Dept. 1896 Animal Husbandry Assistant Posts"
Post a Comment