Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

US Visa Rules Change.. New Rules for Student Visa.

 అమెరికా వీసా రూల్స్‌ మార్పు.. స్టూడెంట్ వీసా కోసం కొత్త నిబంధనలు.

US Visa Rules Change.. New Rules for Student Visa.


ఈరోజుల్లో ఉన్నత చదువులు చదివేందుకు చాలా మంది భారతీయులు విదేశాలకు తరలిపోతున్నారు. చాలామంది ఇందుకు అమెరికాను ఫస్ట్ ఛాన్స్‌గా సెలక్ట్ చేస్తున్నారు.

అయితే యూఎస్‌లో అకడమిక్ స్టడీస్ పూర్తి చేయాలని భావిస్తున్న స్టూడెంట్స్‌ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. తాజాగా భారత్‌లోని యూఎస్ ఎంబసీ (US Embassy), స్టూడెంట్ వీసా దరఖాస్తు ప్రక్రియలో కొన్ని మార్పులను ప్రకటించింది.

కొత్త మార్పులు అన్ని F, M, J స్టూడెంట్ వీసా అప్లికెంట్స్‌కు వర్తిస్తాయి. నవంబర్ 27 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ వీసాలు అకడమిక్, ఒకేషనల్, ఎక్స్ఛేంజ్ స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉంటాయి. యూఎస్ ఎంబసీ ఈ అప్‌డేట్స్‌ను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసింది. ఈ మార్పుల కారణాలు, చిక్కులను వివరించింది.

కొత్త మార్పుల ప్రకారం, దరఖాస్తుదారులు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసేటప్పుడు, వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేటప్పుడు సొంత పాస్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. వేరొకరి పాస్‌పోర్ట్ నంబర్‌తో అపాయింట్‌మెంట్ సిస్టమ్‌ని మోసం చేయకుండా ఆపడానికే ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు.

పాస్‌పోర్ట్ నంబర్‌ను తప్పుగా ఉపయోగించిన దరఖాస్తుదారులు వీసా దరఖాస్తు కేంద్రాల (VAC)లో రిజెక్షన్‌కు గురవుతారు, వీసా ఫీజును కూడా కోల్పోతారని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. రిజెక్షన్‌కు గురైన వారు కొత్త ప్రొఫైల్‌ని క్రియేట్ చేయాలి, లేదా సరైన పాస్‌పోర్ట్ సమాచారంతో ఇప్పటికే ఉన్న ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయాలి. మరొక అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి మళ్లీ వీసా ఫీజు చెల్లించాలి.

ఎలిజిబిలిటీ చెక్ చేయడం తప్పనిసరి

దరఖాస్తుదారులు తప్పనిసరిగా F లేదా M వీసాల కోసం స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) ద్వారా సర్టిఫై అయిన స్కూల్ లేదా ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలి. J వీసాల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అప్రూవ్డ్ ఆర్గనైజేషన్ నుంచి సురక్షిత స్పాన్సర్‌షిప్ పొందాలి. వీసా కోసం అప్లై చేయడానికి ముందు స్కూల్ లేదా ప్రోగ్రామ్ అర్హతను తనిఖీ చేయాలని దరఖాస్తుదారులకు యూఎస్ ఎంబసీ సూచించింది.

మరిన్ని మార్పులు

ఓల్డ్ పాస్‌పోర్ట్ పోయినా లేదా దొంగతనానికి గురైనా, యూఎస్ ఎంబసీ పేర్కొన్న విధంగా VAC వద్ద వీసా అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తుదారులు ఓల్డ్ పాస్‌పోర్ట్ నంబర్ ఫొటోకాపీ లేదా ఇతర డాక్యుమెంటేషన్‌ను అందించాలి. ఇది ఐడెంటిఫికేషన్, ప్రీవియస్ వీసా హిస్టరీ వెరిఫై చేయడానికి అవసరమవుతుంది. స్టూడెంట్ వీసా కోసం అప్లై చేసుకోవాలని భావిస్తున్న విద్యార్థులు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం.

వీసా జారీ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు సిబ్బందిని పెంచాలని యోచిస్తున్నట్లు, భారతదేశంలో కొత్త కాన్సులేట్‌లను ఓపెన్ చేయడానికి కృషి చేస్తున్నట్లు US ఎంబసీ హామీ ఇచ్చింది. కొత్త కాన్సులేట్‌లను ఇటీవల అహ్మదాబాద్, హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రారంభించింది. గత ఏడాది కంటే 2023లో ఎక్కువ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు US ఎంబసీ పేర్కొంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "US Visa Rules Change.. New Rules for Student Visa."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0