Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

World Cup Final

భారత్ ఆస్ట్రేలియా సమర సంగ్రామానికి సర్వం సిద్ధం

World Cup Final


అహ్మదాబాద్ లో నీలి సముద్రం

CWC-2023 అహ్మదాబాద్  నరేంద్ర మోధి స్టేడియంకు అభిమానులు పోటేత్తారు. కాసేపట్లో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం వేలాదిగా తరలివస్తున్నారు. మొత్తం 1.30 లక్షల మంది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తారు. అలాగే అతిరథ మహారథులు హాజరు కానున్నారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మం త్రులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, అమెరికా రాయబారి ఎరిక్ గస్సెట్టి, అస్సాం సిఎం హేమంత్ బిస్వా శర్మ, భారత్‌లోని ఆస్ట్రేలియా రాయబారి ఫిలిప్ గ్రీన్, రిలియన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు, బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు తదితరులు ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించనున్నారు.

ఫైనల్ మ్యాచ్‌కు వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్ల కెప్టెన్లను కూడా ఆహ్వానించారు. కపిల్ దేవ్, ధోనీ, క్లైవ్ లాయిడ్, అలెన్ బోర్డర్, స్టీవ్‌వా, క్లార్క్, ఇయాన్ మోర్గాన్, పాంటింగ్‌లు హాజరుకానున్నారు.

అయితే జైలులో ఉన్న కారణంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఫైనల్‌కు రాలేక పోతున్నారు. కెప్టెన్ల కోసం బిసిసిఐ ప్రత్యేకమైన బ్లేజర్‌ను బిసిసిఐ తయారు చేయించింది. మాజీ కెప్టెన్లు ఈ బ్లేబర్‌ను ధరించి ఫైనల్‌ను వీక్షిస్తారు.

అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ఫైనల్ మ్యాచ్‌కు వాయుసేన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా మార నున్నాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పది నిమిషాల పాటు వైమానిక దళం విన్యాసాలు చేయనుంది. 9 ఎయిర్ క్రాఫ్ట్‌ల బృందంగల సూర్యకిరణ్ ఏక్రోబాటిక్ టీమ్ ఈ వేడుకల్లో కనువిందు చేయనుంది.

అంతేగాక ఫైనల్ మ్యాచ్‌ను పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

ప్రీతమ్, జోనితా గాంధీ, అమిత్ మిశ్రా, నకాష్ అజీజ్, తుషార్ జోషి వంటి స్టార్ సింగర్లు అలరించనున్నారు. 500 మందికి పైగా డ్యాన్సర్లు తమ నృతంతో కనువిందు చేయనున్నారు. దీంతో పాటు 90 సెకన్ల పాటు జరిగే లైట్‌షో, లేజర్‌షో ఫైనల్‌కు హైలైట్‌గా నిలువనుంది.

అంతేగాక డ్రింక్స్ బ్రేక్, మొదటి ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో పలువురు సెలబ్రెటీలు తమ ప్రదర్శనతో అభిమానులను ఉర్రుతాలుగించనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారీ స్థాయిలో బాణాసంచా, టపాసులు కాల్చనున్నారు.

మరోవైపు మ్యాచ్‌ను పురస్కరించుకుని స్టేడియం పరిసరాల్లో కని విని రీతిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 60వేల మంది భద్రత సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు.

జయహో 🚩భారత్ 🇮🇳

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "World Cup Final "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0