Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Google Contacts App Latest Feature In Telugu

 ఫోన్ నంబర్ ఉంటే చాలు - యూజర్ లొకేషన్​ కనిపెట్టేయొచ్చు! Google కాంటాక్ట్స్​ కొత్త ఫీచర్

Google Contacts App Latest Feature In Telugu

Google Contacts App Latest Feature In Telugu : ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ గుడ్ న్యూస్​. Google Contacts App యూజర్ ఫోన్ నంబర్ ఆధారంగా, అతని కరెంట్ లొకేషన్​ను ట్రాక్​ చేసే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది.

మరి ఈ ఫీచర్​ను ఎలా ఉపయోగించాలి? దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Google Contacts App Latest Feature : మనం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళతాం. లేదా ఏదైనా ఫంక్షన్​కు వెళతాం. మనతో వచ్చిన పిల్లలు లేదా పెద్దలు అప్పుడప్పుడూ తప్పిపోతూ ఉంటారు. దీనితో వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియక, చాలా కంగారు పడిపోతూ ఉంటాం.

కొన్నిసార్లు మనం కొత్త ఊరు వెళతాం లేదా సిటీకి వెళ్తాం. ఫ్రెండ్​ రూమ్​కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అతను/ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, వారి లొకేషన్ తెలియక ఇబ్బందిపడుతూ ఉంటాం. ఈ సమస్యకు చెక్ పెడుతూ 'Google కాంటాక్ట్స్​ యాప్'​ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఫోన్ నంబర్ ఉంటే చాలు, సదరు యూజర్​ కరెంట్​ లొకేషన్​ను ఈ ఫీచర్​ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్​ ఎనేబుల్ చేసుకోండిలా

How To Enable Google Contacts Live Tracker Feature : Google​ కాంటాక్ట్స్ యాప్​ 4.22.37.586680692 వెర్షన్​ను అప్​డేట్​ చేసుకున్న ఆండ్రాయిడ్​ యూజర్లకు ఈ నయా ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే?

  • ముందుగా మీ ఆండ్రాయిడ్​ ఫోన్​లోని Settings ఓపెన్ చేయాలి.
  • Apps సెక్షన్​లోని Google Contacts ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • వెంటనే మీకు యాప్ ఇన్ఫో కనిపిస్తుంది. దీనిలోనే Google కాంటాక్ట్స్ యాప్​ వెర్షన్ నంబర్​ కనిపిస్తుంది.
  • లేటెస్ట్ 4.22.37.586680692 వెర్షన్​ ఉంటే ఓకే. లేదంటే వెంటనే ఫోన్​ను అప్​డేట్​ చేసుకోండి. అంతే సింపుల్​!

నోట్​ : ఒక వేళ యాప్​ అప్​డేట్ చేసినా 4.22.37.586680692 వెర్షన్​ రాకపోతే, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ వెర్షన్​ ఒక క్రమ పద్ధతిలో రోల్​అవుట్ అవుతోంది. కనుక త్వరలోనే మీకు కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. మీ ఫోన్​లో కనుక గూగుల్ కాంటాక్ట్స్ యాప్​ లేనట్లయితే.. Google ప్లే స్టోర్​కు వెళ్లి, లేటెస్ట్ వెర్షన్​ను డౌన్​లోడే చేసుకోవచ్చు.

ఎవరి లొకేషన్ ట్రేస్ చేయవచ్చు?

ఈ నయా ఫీచర్​తో మీ జీ-మెయిల్​లో, ఫోన్​ కాంటాక్ట్​ లిస్ట్​లో ఉన్నవారి కరెంట్​ లొకేషన్​ను మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇంతకు ముందు ఎవరైతో తమ లొకేషన్​ను Google మ్యాప్స్ ద్వారా మీకు షేర్​ చేశారో, వారి కరెంట్ లొకేషన్​ను కూడా మీరు ట్రాక్ చేయగలుగుతారు.

లైవ్​ లొకేషన్​ను ఎలా ట్రాక్ చేయాలంటే?

How To Track Live Location With Google Contacts :

  • ముందుగా మీరు Google కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేయాలి.
  • మీరు ఎవరి లొకేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వారి ఫోన్ నంబర్​ను ట్యాప్ చేయాలి.
  • వెంటనే మీకు యూజర్ ఫొటో, అతని కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి.
  • అక్కడే Google Maps. Location Sharing ఆప్షన్​ కూడా కనిపిస్తుంది.
  • ఈ Google మ్యాప్స్​ లింక్​ను ఓపెన్ చేస్తే, వెంటనే సదరు యూజర్​ ఉన్న కరెంట్ లొకేషన్​ మీకు కనబడుతుంది.
  • మనం సదరు యూజర్​ ఉన్న లొకేషన్​కు వెళ్లాలంటే.. Google మ్యాప్స్ అతను/ ఆమె ఉన్న డైరెక్షన్​ను కూడా చూపిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Google Contacts App Latest Feature In Telugu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0