Key directive of AP Sarkar on pass books
AP Lands: పాస్ పుస్తకాలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశం
అంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఓ మెమో జారీ చేసింది. ఇది దేనికంటే, ఇది రీ-సర్వే చేసిన వ్యవసాయ భూమి యొక్క సబ్-డివిజన్ రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్‌కి సంబంధించినది.
ఈ మ్యుటేషన్‌కి సంబంధించి నిర్దిష్ట సూచనలను జారీ చేసింది. దీన్ని మరింత వివరంగా పరిశీలిస్తే.
A) గ్రామంలో రీ-సర్వే పూర్తయినా, రీ-సర్వే చేయకపోయినా, అన్ని గ్రామాల్లో రిజిస్ట్రేషన్, ఆ తర్వాత మ్యుటేషన్ చేసే ముందు, వ్యవసాయ భూమిని తప్పనిసరిగా సర్వే సబ్ డివిజన్ చెయ్యాలి.
B) గ్రామంలో రీసర్వే పూర్తయినా, అవ్వకపోయినా, అన్ని గ్రామాలలో ఏదైనా మ్యుటేషన్ అభ్యర్థన వస్తే, ముందుగా వ్యవసాయ భూమిని తప్పనిసరిగా సర్వే సబ్ డివిజన్ చెయ్యాలి.
C) రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ ప్రక్రియను స్వయంగా చేయడం, పోస్ట్ సబ్-డివిజన్, అన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ అవసరమైనా, కాకపోయినా, ఏపీ హక్కుల రికార్డును సవరించాలి. తద్వారా భూమి, పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టం, నిబంధనలు సులభతరం అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
ఈ రూల్స్‌ని అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అదేశించింది.
ప్రజలు ఏం చెయ్యాలి?
ప్రజలు తమ వ్యవసాయ భూమికి సబ్-డివిజన్ రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ చేయించాలి అనుకుంటే, ఆ మ్యుటేషన్‌కి ఈ కొత్త రూల్స్ అమలవుతాయి. ఏంటే, మ్యుటేషన్ చేసే ముందు అధికారులు వ్యవసాయ భూమిని తప్పనిసరిగా సర్వే సబ్ డివిజన్ చేస్తారు. తమ భూమికి ఆల్రెడీ రీ-సర్వే జరిగింది అని చెప్పినా వారి దాన్ని లెక్కలోకి తీసుకోరు. తమ ఆదేశం ప్రకారం వారు సర్వే సబ్ డివిజన్ చేస్తారు. దీనిపై ఆందోళన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి గందరగోళమూ లేకుండా.. రెవెన్యూ విభాగం ఈ సర్వే సబ్ డివిజన్ అంశాన్ని చూస్తుందని అధికారులు తెలిపారు.
0 Response to "Key directive of AP Sarkar on pass books"
Post a Comment