Railway Jobs
Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్. రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు.
Railway Jobs: వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే 3,015 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు అలర్ట్. భారత రైల్వేలో భారీగా అప్రెంటీస్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. తాజాగా వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే 3,015 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ గడువు జనవరి 14తో ముగుస్తుంది. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
మొత్తం పోస్టులు : 3015
ఖాళీల వివరాలు
వెస్ట్రన్ సెంట్రల్ రైల్వేలోని వివిధ డివిజన్లలో అప్రెంటీస్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ప్రధానంగా జేబీపీ డివిజన్‌లో 1164 అప్రెంటీస్ ఉద్యోగాలు, కోట డివిజన్ 853, బీపీఎల్ డివిజన్ 603, డబ్ల్యూఆర్‌ఎస్ 196, సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్ 170, హెచ్‌క్యూ/జేబీపీ డివిజన్‌లో 29 అప్రెంటీస్ ఖాళీలకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.
అర్హత ప్రమాణాలు
దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ తప్పనిసరి.
వయోపరిమితి
అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ మాత్రమే చెల్లించాలి.
అప్లికేషన్ ప్రాసెస్
ముందుగా వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే అధికారిక పోర్టల్ wcr.indianrailways.gov.in విజిట్ చేయాలి.
హోమ్‌పేజీలోకి వెళ్లి ‘డబ్ల్యూసీఆర్ అప్రెంటీస్-2023 రిక్రూట్‌మెంట్’ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
తరువాత ‘అప్లై ఆన్‌లైన్’ అనే లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందు వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
అనంతరం రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్ ఫిలప్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్
అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పదో తరగతి, ఐటీఐలో పొందిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. పదోతరగతి మార్కులు, ఐటీఐ మార్కులకు సమాన వెయిటేజీ ఉంటుంది. ఎంపికయ్యే అభ్యర్థులకు వెస్ట్రన్ సెంట్రల్ రైల్వేలోని విభాగాలు, యూనిట్లు, వర్క్ షాప్‌ల్లో అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది.
నార్త్ రైల్వేలో కూడా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 3093 అప్రెంటిస్ పోస్టులు భర్తీ కానున్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 11న ప్రారంభం కాగా, ఈ గడువు జనవరి 1న ముగుస్తుంది.
0 Response to "Railway Jobs"
Post a Comment