Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

There is no risk of covid JN1 variant. World Health Organization revealed.

 Covid-19 JN.1 : కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వల్ల ప్రమాదం లేదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి.

There is no risk of covid JN1 variant. World Health Organization revealed.

ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న కొవిడ్-19 ఓమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ 1 వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వ్యాఖ్యలు చేసింది.

జేఎన్ 1 కరోనావైరస్ జాతి ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు కలిగించదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. జేఎన్ 1 సబ్ వేరియంట్ వల్ల ఎదురయ్యే ప్రజారోగ్య ప్రమాదం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా వేసింది. కొవిడ్ బీఏ 2.86 జాతికి చెందిన సబ్ వేరియంట్ జేఎన్ 1 అని ఆ సంస్థ వర్గీకరించింది.

కొవిడ్ వ్యాక్సిన్ తో రక్షణ

ప్రస్తుతం ఉన్న కొవిడ్ వ్యాక్సిన్‌లు కొవిడ్ -19 జేఎన్ 1 వైరస్ వల్ల మరణాల నుంచి రక్షణను కొనసాగిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ లో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ 15 నుంచి 29 శాతం ఉందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఇతర వేరియంట్‌లతో పోలిస్తే జేఎన్ 1 ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తోందనడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని యూఎస్ వైద్యనిపుణులు చెప్పారు.

కొవిడ్ వ్యాక్సిన్లు అమెరికన్లను జేఎన్ 1 సబ్ వేరియంట్ నుంచి రక్షించగలదని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ పేర్కొంది. కొవిడ్ -19 జేఎన్ 1 సబ్ వేరియంట్ అమెరికా దేశంలో సెప్టెంబరు నెలలో వెలుగుచూసింది. గత వారం చైనాలో ఈ కొత్త సబ్ వేరియంట్ ఏడుగురికి సోకిందని తేలింది.

దేశంలో పెరుగుతున్న కేసులు

కేరళ రాష్ట్రంలో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్క రోజే 142 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ పరీక్షలు పెంచడంతో పాటు ఈ కొత్త వేరియంట్ నివారణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు అన్ని రాష్ట్రాలు సమాయత్తమయ్యాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "There is no risk of covid JN1 variant. World Health Organization revealed."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0