Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ap Cabinet Meet On January 31st

 ఏపీ కేబినెట్ భేటీ.. ఈ నెల 31న రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్?

Ap Cabinet Meet On January 31st

Ap Cabinet Meet On January 31st ఈ నెల 31న రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెబుతోందనే చర్చ జరుగుతోంది. బుధవారం జరిగే మంత్రిర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే మహిళలకు సంబంధించి కూడా మరో నిర్ణయం ఉంటుందంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాల ఉండబోతున్నాయని.. ఎన్నికల ముందు చాలా కీలకం అనే చర్చ.

ప్రధానాంశాలు:

  • ఈ నెల 31న ఏపీ కేబినెట్ సమావేశం
  • కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
  • రైతులు, మహిళలకు శుభవార్త ఉందా?
  • ఈ  నెల 31న ఏపీ కేబినెట్ భేటీ
  • ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ
  • రుణమాఫీ విధివిధానాలపై కేబినెట్ లో కీలక నిర్ణయం
  • ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చ
  • వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్...
  • అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. కొత్త పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్నికల ముందు రైతు రుణమాఫీకి అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంటారనే వాదన వినిపిస్తోంది

ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ అంశం.. డీఎస్సీ నోటిఫికేషన్.. అసెంబ్లీ సమావేశాల.. జగనన్న కాలనీలు.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి అంశాలపై కేబినెట్‌లతో చర్చించే అవకాశం ఉందంటున్నారు. అయితే పూర్తిస్థాయిలో క్లారిటీ మాత్రం లేదు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంశం మాత్రం పరిశీలనలో ఉందంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ నుంచి ప్రతిపాదనలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పరిస్థితిని బట్టి ఉచిత ప్రయాణం పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జిల్లా పర్యటనలు, పొత్తులు ఎత్తులు పై మంత్రులతో చర్చించే ఛాన్స్ ఉంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ap Cabinet Meet On January 31st"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0