AP TET 2024: Note to unemployed.. Govt orders revising TET Paper-1, Paper 2 qualifications.
AP TET 2024: నిరుద్యోగులకు గమనిక.. టెట్ పేపర్-1, పేపర్ 2 అర్హతలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసేందుకు అర్హతలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకటి నుంచి 5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT)కు నిర్వహించే టెట్-1 పేపర్ పరీక్ష, ఆరు నుంచి పదో తరగతి వరక బోధించేందుకు నిర్వహించే పేపర్ 2 పరీక్షకు హాజరయ్యేందుకు అర్హతలను సవరించింది. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (DELED), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (BELED) చేసిన వారు మాత్రమే పేపర్ 1 పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొంది. ఇంటర్మీడియట్, తత్సమాన విద్యార్హతలో ఓసీ అభ్యర్ధులకు 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టింది.
ఈ మార్కుల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మినహాయింపునిచ్చి, 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని పేర్కొంది. బీఈడీ చేసిన వారు కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హులేనంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసినందున ఈ సవరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. టెట్ పరీక్ష నిర్వహణ వ్యయాన్ని కూడా అభ్యర్థుల దరఖాస్తు ఫీజుల నుంచే భరించాలని ఈ సందర్భంగా సూచించింది. గతంలో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించాలనే నిబంధన ఉండేది. కానీ 2021 నుంచి ఏడాదికి ఒక్కసారే ఈ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం సవరించింది.
పేపర్ – 2 అర్హత మార్కుల్లో మినహాయింపు.. ఎంతంటే
టెట్ పేపర్ – 2 కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులను 40 శాతానికి కుదించారు. అయితే ఈ ఒక్కసారికి మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో టెట్ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతం ఉండేది. తాజాగా దీన్ని 5 శాతానికి తగ్గించింది. డిగ్రీలో 40 శాతం మార్కులతో బీఈడీ చేసేందుకు అనుమతిస్తున్నందున.. టెట్ రాసేందుకు 45శాతం ఉండాలనే నిబంధన గతంలో పెట్టారు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజా టెట్ పరీక్షకు కూడా పేపర్ 2 రాసేందుకు 5 మార్కులు మినహాయించి 40 మార్కులకు కుదించారు. కాగా అందిన సమాచారం మేరకు టెట్ నోటిఫికేషన్ నేడో రేపో విడుదలకానుంది
0 Response to "AP TET 2024: Note to unemployed.. Govt orders revising TET Paper-1, Paper 2 qualifications."
Post a Comment