Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Group 1 : Good news for APPSC Group-1 candidates, application deadline has been extended till 28th of this month

 APPSC Group 1 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఈ నెల 28 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు.

APPSC Group 1 : Good news for APPSC Group-1 candidates, application deadline has been extended till 28th of this month

ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూ్స్ చెప్పింది. దరఖాస్తు గడువును మరో వారం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

గత నెలలో 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పోస్టులకు జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును జనవరి 28వ తేదీ వరకు పొడిగించింది ఏపీపీఎస్సీ. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి డిస్క్రిప్టివ్‌ విధానంలో మెయిన్‌ నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. మొత్తం 81 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు

  • డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు-9
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌-18
  • డీఎస్పీ (సివిల్‌)- 26
  • రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌-6
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు-5
  • జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌- 4
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్స్- 3
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌- 2
  • జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌- 1
  • జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌-1
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II-1
  • ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌- 1

ప్రిలిమ్స్ పరీక్ష విధానం

స్కీనింగ్ టెస్ట్ లో భాగంగా ముందు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 240 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మార్కులకు 120 మార్కులు అడుగుతారు. ఒక్కో పేపర్ కు గం. 2 ల సమయం కేటాయిస్తారు. పేపర్-1లో పార్ట్-ఏలో హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్-బిలో రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్-సిలో ఏపీ, ఇండినయ్ ఎకానమీ, ప్లానింగ్, పార్ట్-డిలో జాగ్రఫి నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు.

మెయిన్స్ పరీక్ష విధానం

మెయిన్స్ రాత పరీక్షలో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు లాంగ్వేజెస్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. అయితే వీటిని క్వాలిఫైయింగ్ పరీక్షలుగా పరిగణిస్తారు. మొత్తం ఐదు పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ రాత పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

గ్రూప్-2 దరఖాస్తులు-ఒక్కో పోస్టుకు 537 మంది పోటీ

ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 897 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా మరో రెండు పోస్టులను చేర్చింది. ఈ 899 పోస్టులకు ఇటీవల దరఖాస్తు ప్రక్రియ పూర్తైంది. గ్రూప్-2 పోస్టులకు మొత్తం 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అంటే ఒక్కో పోస్టుకు 537 మంది పోటీపడుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగియడంతో అప్లికేషన్లలో తప్పులను సవరించుకునేందుకు జనవరి 24 వరకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Group 1 : Good news for APPSC Group-1 candidates, application deadline has been extended till 28th of this month"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0