BITS Pilani BITSAT-2024 Notification
BITSAT: బిట్శాట్- 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షల షెడ్యూలు వివరాలు.
BITS Pilani BITSAT-2024 Notification: రాజస్థాన్లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్శాట్ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(జనవరి 22న) అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆయా క్యాంపస్లలో బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11తో ముగియనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 15 నుంచి 19 వరకు దరఖాస్తుల సవరణరకు అవకాశం కల్పిస్తారు. మే 21 నుంచి 26 వరకు బిట్శాట్ (సెషన్-1), జూన్ 22 నుంచి 26 వరకు బిట్శాట్ (సెషన్-2) పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు
బిట్శాట్ - 2024 ప్రవేశ ప్రకటన
క్యాంపస్లవారీగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాం:
I. బిట్స్పిలానీ- పిలానీ క్యాంపస్:
బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్.
బీఫార్మసీ
ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
ఎంఎస్సీ: జనరల్ స్టడీస్.
II. బిట్స్ పిలానీ- కేకే బిర్లా గోవా క్యాంపస్:
బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్.
ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
III. బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్:
బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్.
బీఫార్మసీ
ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
అర్హత:అభ్యర్థులు 75 శాతం మార్కులతో(గ్రూపు సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం మార్కులు) ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్/బయాలజీ) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు:సెషన్-1, 2 పరీక్షలకు రూ.5400 (పురుషులకు); రూ.4400 (మహిళలకు).
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ:బిట్శాట్-2024 టెస్టు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
పరీక్ష విధానం:బిట్శాట్-2024 టెస్టు రెండు సెషన్లలో జరుగుతుంది. అభ్యర్థులు రెండు సెషన్లు రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు:హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం.
ముఖ్యమైన తేదీలు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.04.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 15 - 19.04.2024 వరకు.
బిట్శాట్ ఆన్లైన్ టెస్ట్ (సెషన్-1) తేది: 21- 26.05.2024.
బిట్శాట్ ఆన్లైన్ టెస్ట్ (సెషన్-2) తేది: 22 -26.06.2024.
0 Response to "BITS Pilani BITSAT-2024 Notification"
Post a Comment