Ayodhya Prana Prathishta
Ayodhya: అయోధ్య తీర్పు వెనక ఉన్న వ్యక్తి ఈయనే.అంధుడైనా
నేడ కోట్లాది మంది హిందువులు అత్యంత సంతోషంగా రామ మందిర ప్రారంభోత్సవం జరుపుకుంటున్నారంటే దాని వెనక ఎందరో కృషి ఉంది. వారిలో ఒకరి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం.
ఐదు దశబ్దాల హిందువుల నిరీక్షనకు మరి కొన్ని గంటల్లో తెర పడనుంది. ఎన్నో పోరాటాలు, ఆందోళనల తర్వాత.. ఇప్పుడు అయోధ్యలో రాముడి మందిరం నిర్మాణం సాధ్యపడింది. ఆలయ నిర్మాణఃలో నేడు ముఖ్య ఘట్టమైన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు అనగా జనవరి 22, సోమవారం మధ్యాహ్నం.. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేశమంతా ఎక్కడ చూసిన రామ నామం, అయోధ్య పేర్లే వినిపిస్తున్నాయి. నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆయన వల్లే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. దాని వల్ల నేడు మందిర నిర్మాణం సాధ్యం అయ్యింది. ఇంతకు ఎవరా వ్యక్తి అంటే.
అయోధ్య వివాదంలో.. రాముడిని గెలిపించిన వ్యక్తి పేరు రామభద్రాచార్యస్వామి.. ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షం గా వచ్చింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ స్వామీజీ అంధుడు. కానీ ఆ లోపం ఆయన ఎదుగుదలను ఆపలేదు. ఈ క్రమంలో అయోధ్య విచారణ సందర్భంగా రామభద్రాచార్య స్వామి ఋగ్వేదంలో శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలను కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి మహిమ, సనాతనధర్మం గొప్పతనం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు.
ఋగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణజ్ఞుడయిన శ్రీ నీలకంఠ పండితుడు ఏనాడో రాసిన భాష్యం.. మంత్ర రామాయణం. దీనిలో 157 ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుండి సీతా మాతా భూమిలోకి ప్రవేశించే ఘట్టం వరకు ఉంది. వీటన్నింటిని రామభద్రాచార్య స్వామి కోర్టు వాదనల సందర్భంగా విన్నవించారు.
రామజన్మభూమి వివాదం గురించి కోర్టులో వాదాలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒకరు.. హిందువులు అన్నింటికి వేదం ప్రమాణమంటారు కదా.. మరి ఆ వేదాలలో రాముడి గురించి ఎక్కడ ఉందో చెప్పమని ప్రశ్నించారట. అప్పుడే అయోధ్య ఆలయం తరఫున వాదనలు వినిపిప్తున్న లాయర్.. రామభద్రాచార్య స్వామిని కోర్టుకు తీసుకువచ్చి సాక్ష్యం ఇప్పించారు. అంధుడైనప్పటికి.. ఆయన అనర్గళంగా ఆయన ఋగ్వేదమంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథని వివరిస్తూంటే జడ్జీలతో సహా కోర్టంతా దిగ్భ్రాంతికి లోనయ్యింది.
అంధుడు పుస్తకం, మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన రుగ్వేద మంత్రాలు, దాని భాష్యం చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా రాముడిని గెలిపించడంలో రామభద్రాచారా స్వామి కీలక పాత్ర పోషించారు. నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంఉటన్నారు. రామభద్రాచార్య స్వామి విషయానికి వస్తే.. ఆయన ఒక మఠానికీ అధిపతి కూడా. ఏది ఏమైనా కోట్లాది మంది హిందువుల కల నెరవేర్చడంలో ఆయన కృషి మరపురానిది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు
అయోధ్య మందిరం కోసం 2500 కోట్ల విరాళాలు.. ఎవరు ఎక్కువ ఇచ్చారంటే?
Ayodhya Ram Mandir.. చారిత్రాత్మక ఘట్టం.. నేడు చరిత్రలో నిలిచిపోయే వేడుక కానుంది. ఎన్నో శతాబ్దాలుగా దేని కోసమేతే యుద్దాలు, పోరాటాలు జరిగాయో.. ఇప్పుడు రామాలయ నిర్మాణంతో సఫలీకృతమైంది. అయోధ్యలో జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతుంది.
అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. భారత్ దేశంలో యావత్ ప్రజానీకం.. ఈ వేడుక కోసం వెయ్యి కళ్లతో కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఆ ఉద్వేగపూరిత సమయం వచ్చేసింది. కోట్లాది మంది హిందువుల ఆకాంక్షలు, ఆశలకు తెరలేపింది అయోధ్యలోని రామ మందిరం. జనవరి 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం కేసు తీర్పు వెలువడిన ఇన్నాళ్లకు అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ఈ నిర్మాణానికి కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదు.
ఇది కేవలం ప్రజల నుండి సేకరించిన డబ్బుతోనే నిర్మాణం జరిగింది. ఏడు దశాబ్దాల వివాదాన్ని, ఓ సున్నితమైన అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చిన సుప్రీం కోర్టు.. 2019లో అయోధ్య.. హిందువులదే అని తేల్చి చెప్పింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ మందిర నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ట్రస్టుకు బదలాయించాలని జస్టిస్ రంగన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు నిచ్చింది. ఇక రామ మందిర నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అయితే దీనికి భారీగా ఖర్చు అవుతుందని భావించి రామ జన్మ భూమి క్షేత్ర ట్రస్ట్ విరాళాలను సేకరించడం మొదలు పెట్టింది. అందుకు టార్గెట్ పీరియడ్ నిర్ణయించింది.
శ్రీరాముని మందిర నిర్మాణం కోసం 2021 జనవరి 14వ తేదీన విరాళాల కార్యక్రమం చేపట్టి కేవలం 45 రోజుల పాటు మాత్రమే వాటిని సేకరించింది. అదే ఏడాది ఫిబ్రవరి 27న విరాళాల సేకరణ నిలిపి వేసింది. మొత్తంగా రూ. 2500 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. రూ. 10 కోట్ల మందికి పైగా విరాళాలు అందించారు. వీరిలో ఏ రాష్ట్రం నుండి ఎంత అందాయో తెలుసా.. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ రూ. 20 కోట్లు, మేఘాలయ రూ. 8.5 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ నుండి రూ. 4.5 కోట్లు, నాగాలాండ్ రూ. 2.8 కోట్లు, మిజోరాం రూ. 2.1 కోట్లు అందించాయి. ఇక తమిళనాడు నుండి రూ. 85 కోట్లు, కేరళ నుండి రూ. 13 కోట్లు వచ్చాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (ట్రస్ట్) ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రూ. 5, 00, 100 అందించారు. అలాగే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా తమకు నచ్చిన నగదును విరాళంగా ఇచ్చారు. అయితే వ్యక్తిగతంగా చూస్తే.. గుజరాత్ కు చెందిన ఆథ్యాత్మిక నేత మొరారీ బాపు రూ. 11.3 కోట్ల రూపాయలను అందజేశారు. అంతేనా.. బ్రిటన్, కెనడా దేశాల నుండి విరాళాలు వచ్చాయి. రూ. 8 కోట్లు వసూలు అయ్యాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విరాళాలను ఏకకాలంలో సేకరించారు. 9 లక్షల మంది కార్యకర్తలు 1,75,000 బృందాలుగా విడిపోయి ఇంటింటికి వెళ్లి ఈ నగదును సేకరించారు. ఇప్పటి వరకు రూ. 1800 కోట్లు ఖర్చు చేశారు.
0 Response to "Ayodhya Prana Prathishta"
Post a Comment