Beware of online scams.. How to spot fake messages explained
Online Scams: ఆన్‌లైన్ స్కామ్స్‌తో జాగ్రత్త.. ఫేక్ మెసేజ్‌లను ఎలా గుర్తించాలో వివరణ.
నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌ల కన్వీనియన్స్ మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. ప్రతి చిన్న, పెద్ద అవసరాలకు అందరూ ఎక్కువగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లు చేసేస్తున్నారు
డిజిటల్ పేమెంట్స్‌ని సౌకర్యవంతంగా, సులభంగా, సురక్షితంగా చేయడానికి ప్రభుత్వం కొత్త నియమాలు, విధానాలను ప్రవేశపెట్టింది. అదే సమయంలో, నకిలీ మెసేజ్‌లు లేదా కాల్స్ ద్వారా మోసం చేస్తున్న ఘటనలు కూడా పెరిగాయి. ప్రతి రోజూ ఏదో ఒక మూల సాధారణ ప్రజలు ఆన్‌లైన్ మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. కాబట్టి ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఒక చిన్న పొరపాటు, అవగాహన లోపం కష్టపడి సంపాదించిన మొత్తం డబ్బును కోల్పోయేలా చేయవచ్చు.
ఈ స్కామ్‌ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండటం, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. స్కామర్లు ప్రజలను ఏమార్చేందుకు వివిధ రకాల మోసపూరిత పద్ధతులను ఉపయోగిస్తున్నందున నకిలీ కాల్స్, మెసేజ్‌లను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన మెసేజ్ నిజమైనదా లేదా నకిలీదా అని గుర్తించడానికి గుర్తుంచుకోవాల్సిన కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
అన్‌నౌన్ మొబైల్ నంబర్లు
స్కామ్ మొదటి సంకేతాలలో ఒకటి తెలియని నంబర్ నుంచి ట్రాన్సాక్షన్ అలెర్ట్ రావడం. గుర్తుంచుకోండి, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎల్లప్పుడూ ఐడెంటిఫైయబుల్ సోర్సెస్ నుంచి కస్టమర్లను కాంటాక్ట్ అవుతాయి, మెసేజ్‌లు చేస్తాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మెసేజ్‌లు 'VM-ICICIB', 'AD-ICICIBN' లేదా 'JD-ICICIBK' వంటి ఐడీల నుంచి వస్తాయి. పర్సనల్ నంబర్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లు దాదాపుగా మోసపూరితంగా ఉంటాయి.
* అనుమానాస్పద లింక్‌లు
చాలా మోసపూరిత మెసేజ్‌లలో లింక్‌లు ఉంటాయి. వాటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. ఈ లింక్‌లు తరచుగా మీ పర్సనలైజ్డ్ ఇన్‌ఫర్మేషన్‌ని దొంగిలించడానికి లేదా మీ డివైజ్‌లోకి మాల్వేర్‌ని ప్రవేశపెట్టే లక్ష్యంతో నకిలీ వెబ్‌సైట్‌లకు దారితీస్తాయి. లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే ఆన్‌లైన్ మోసగాళ్లకు డివైజ్ యాక్సెస్ పర్మిషన్లు లభించే ప్రమాదం ఉంది.
* ఉచిత బహుమతులు, లాటరీలు
మీకు ఉచిత బహుమతులు, లాటరీని గెలుచుకోవడం లేదా మీ అకౌంట్‌లోకి ఊహించని డబ్బు క్రెడిట్ అవుతుందని చెబుతూ వచ్చే మెసేజ్‌లను తప్పక అనుమానించాలి. ఈ మెసేజ్‌లను స్కామర్లు పంపి ఉంటారని భావించాలి. బ్యాంకులు ఎప్పుడూ టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఉచిత బహుమతులను అందించవు. ఈ మెసేజ్‌లను
మోసగాళ్లు మిమ్మల్ని తమ ట్రాప్‌లో పడవేయడానికి ఉపయోగిస్తారు. పొరపాటు ఈ మెసేజ్‌లను నమ్మి, మోసగాళ్లను సంప్రదించడానికి ప్రయత్నిస్తే.. ఊహించని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
* పూర్ గ్రామర్, స్పెల్లింగ్
స్కామర్‌లు తరచుగా సరైన స్పెల్లింగ్ లేదా గ్రామర్‌పై ఎక్కువ శ్రద్ధ చూపరు. మీరు గ్రామర్ మిస్టేక్‌లు, స్పెల్లింగ్ తప్పులు లేదా అనవసరమైన పెద్ద అక్షరాలతో మెసేజ్‌ను అందుకుంటే, జాగ్రత్తగా ఉండండి. బ్యాంకుల నుంచి వచ్చే మెసేజ్‌లు ప్రొఫెషనల్‌గా ఉంటాయి, ఇటువంటి లోపాలకు ఆస్కారం ఉండదు.
0 Response to "Beware of online scams.. How to spot fake messages explained"
Post a Comment