Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bhogi festival

 Bhogi festival భోగ భాగ్యాల ‘భోగి’కి ఆ పేరేలా వచ్చింది... భోగి పళ్ల ప్రాముఖ్యతలేంటో తెలుసుకుందాం

Bhogi festival

Bhogi festival in Telugu తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే ‘భోగి’ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పిడకలను, కట్టెలను పాత వస్తువులను భోగి మంటల్లో వేడుకలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భోగి పండుగ ఎలా వచ్చింది.. ఎందుకని భోగి మంటలు వేస్తారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే.. అదే విధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మలకొలువును కూడా జరుపుతారు. అయితే సరిగ్గా భోగి రోజు మంటలెందుకు వేస్తారు.. అసలు భోగి పేరేలా వచ్చింది.. దీని వెనుక ఉన్న కారణాలు, కథనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

శాస్త్రీయ కారణాల ప్రకారం, సూర్యుడు దక్షిణయానం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణా యానంలో తాము పడిన కష్టాలు, బాధలను తట్టుకున్నందుకు.. ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు.

భోగి ఎందుకు జరుపుకుంటారో వివరణ

భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం, శ్రీ రంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందిందని.. దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు. మరో కథనం మేరకు.. శ్రీ మహా విష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని.. అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు.

భోగి మంటలతో ఆరోగ్య ప్రయోజనాలు

జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు. కానీ భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెలరోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అందరూ ఒకే చోటకు

ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పలెటూళ్లో విధిగా వేస్తారు. అంతేకాదు ఊళ్లో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకేచోట చేర్చి, ఐక్యమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ.. వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు.

బొమ్మల కొలువు

భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్లను పోస్తారు. ఇదే రోజున బదరీ వనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీ పళ్ల(రేగు పళ్లు)తో అభిషేకం చేశారు. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగి పళ్లుగా మారాయి. వీటితో పాటు పూలు, శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారని చాలా మంది నమ్ముతారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bhogi festival"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0