Let us know why Sri Lanka is shown on India map.
India Map: ఇండియా మ్యాప్‌లో శ్రీలంకను ఎందుకు చూపిస్తారో తెలుసుకుందాం.
మనం చిన్నప్పటి నుంచి ఇండియా మ్యాప్ చూస్తున్నాం. మన మ్యాప్‌లో కిందభాగంలో శ్రీలంక దేశం కూడా కనిపిస్తుంది. మనది వేరే దేశం.. శ్రీలంకది వేరే దేశం అయినా భారత మ్యాప్‌లో మాత్రం శ్రీలంక కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ దేశమైనా దాని సరిహద్దుల ఆధారంగా మ్యాప్‌ను రూపొందిస్తారు. ప్రపంచ దేశాలన్నీ ఇలాగే తమ భౌగోళిక మ్యాప్‌ను పొందుపరుస్తాయి. కానీ, ఒక్క భారత మ్యాప్‌లో మాత్రమే మన భూగోళంలో పక్కనే ఉన్న శ్రీలంక దేశాన్ని కూడా చూపిస్తుంది.
ఎందుకు ఇలా
ఒక దేశం మ్యాప్‌ను మరో దేశం మ్యాప్‌లో మనం ఎప్పుడూ చూసి ఉండం. మన సరిహద్దు దేశాలైనా పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. కానీ ఇవేవీ భారత మ్యాప్‌లో కనిపించవు. కానీ శ్రీలంక మాత్రం మన మ్యాప్‌లో కనిపిస్తుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒక దేశం మ్యాప్‌లో మరో దేశం చూపించడం నేరం. కానీ, భారత దేశ మ్యాప్‌లో శ్రీలంకను చూపినా అది నేరంగా పరిగణించడం లేదు. దీనికి ఓ కారణం ఉంది. అయితే ఆ కారణం చాలా మందికి తెలియదు.
సముద్ర చట్టం ప్రకారం..
సముద్ర చట్టం ప్రకారం.. ఒక దేశ సరిహద్దులో ఉన్న సముద్ర ప్రాంతాన్ని కూడా ఆ దేశం మ్యాప్‌లో చూపించాలి. దీనిని ఐక్యరాజ్యసమితి కూడా ఆమోదించింది. సరిహద్దున ఉన్న సముద్రంలో 200 నాటికల్ మైల్స్ వరకు అంటే 370 కిలోమీటర్ల సముద్రమట్టం మ్యాప్‌లో చూపించాలి. ఈ చట్టం ప్రకారం.. మన దేశం 370 కిలోమీటర్ల సరిహద్దును చూపుతుంది. అందుకే మనమ్యాప్‌లో శ్రీలంక కూడా వస్తుంది. భారతదేశంలోని తమిళనాడు రామేశ్వరం నుంచి శ్రీలంక కేవలం 18 నాటికల్ మైల్స్ మాత్రమే ఉంటుంది. అంటే 54.8 కిలోమీటర్లు మాత్రమే. అందుకే మ్యాప్‌లో ఇండియా కచ్చితంగా శ్రీలంకను చూపించాల్సిన పరిస్థితి.
0 Response to "Let us know why Sri Lanka is shown on India map."
Post a Comment