Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Fish Bone Health Effects

 Fish Bone Health Effects: మీరు కూడా చేప ముల్లులను నమిలి తింటున్నారా.. అయితే జాగ్రత్త?

Fish Bone Health Effects

మాంసాహార ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో చేపలు కూడా ఒకటి. చాలామంది కనీసం వారానికి ఒక్కసారైనా చేపలని తెచ్చుకొని తింటూ ఉంటారు. లేదంటే బయట చేప కబాబ్ చేప ఫ్రై చేపల పులుసు వంటి కూడా తింటూ ఉంటారు.

చేపని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చేపని తినడం వల్ల ఆ కళ్లకు చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు మాంసాహారకృతులు విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. అయితే కొందరు చేపలని ఇష్టంగా తింటే మరికొందరు అందులో ముల్లులు ఉంటాయి అని వాటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. మామూలుగా చేపల్లో ఎముకలు ఉండడం అన్నది సర్వసాధారణం.

ఈ ఎముకల్లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. కొందరు చేప తినేటప్పుడు ముళ్ళును తీసి బయటకు పారేస్తే మరికొందరు ముళ్లు కూడా నములుతూ ఉంటారు. ఈ ఎముకలను తినడం మంచిదే. చేపల ఎముకలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో కాల్షియం లోపాన్ని భర్తీ చేస్తుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యం బాగుంటుంది. ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు చేపల ఎముకలను నమలడం మంచిది. అయితే అది తాజాగా చేప అయ్యిండాలి. అప్పుడే ఫ్రెష్ గా పట్టిన చాపల ఎముకలను తినడం చాలా మంచిది. స్టోర్ చేసిన చేపల ఎముకలు, ముళ్లు తినకూడదు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

చేపల ఎముకలను నమలేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. లేదంటే గొంతులో ముల్లు అడ్డుపడి ఇబ్బంది కలిగించవచ్చు. చేప ఎముకను బాగా నమలి తరవాత మింగాలి. ప్రస్తుత రోజుల్లో దొరికే చేపలు అన్నీ కూడా ఎక్కువగా ఐస్ లో స్టోర్ చేసి పెట్టినవే. అలాంటి చేపల ఎముకలను నమలేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. లేదంటే గొంతులో ముల్లు అడ్డుపడి ఇబ్బంది కలిగించవచ్చు. చేప ఎముకను బాగా నమలి తరవాత మింగాలి. ప్రస్తుత రోజుల్లో దొరికే చేపలు అన్నీ కూడా ఎక్కువగా ఐస్ లో స్టోర్ చేసి పెట్టినవే. అలాంటి వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మార్కెట్‌లో విక్రయించే చేపలలో ఎక్కువ భాగం ఫార్మాలిన్‌ను కలుపుతారు. మరి ఈ చేపల ఎముకలను నమిలితే బహుళ సమస్యల బారి పడే ప్రమాదం పెరుగుతుంది. మీరు జీర్ణ సమస్యల నుండి క్యాన్సర్ వంటి సంక్లిష్ట వ్యాధుల ఉచ్చులో కూడా పడవచ్చు. కాబట్టి కోల్డ్ స్టోరేజీ చేపలను తినకపోవడమే మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Fish Bone Health Effects"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0