Easy way to book gas cylinder on WhatsApp.
LPG Gas: వాట్సాప్‌లో సులభంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొనే విధానం.
WhatsApp Gas Booking: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుండి స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకునే సాంకేతిక వచ్చింది.
ఇక గ్యాస్ కనెక్షన్ అనేది అందరికి ఉండేది. ప్రతి ఒక్కరి కుటుంబంతో అత్యంత అవసరంగా మారిపోయింది. ఒకప్పుడు కట్టెల పొయ్యిపై చేసుకునే కుటుంబాలు.. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలపై చేసుకునే రోజులున్నాయి. అయితే గతంలో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవాలంటే గ్యాస్ ఏజన్సీ ఆఫీస్‌కు పోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు మారిన టెక్నాలజీ కారణంగా మొబైల్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పేటీఎం, ఫోన్ పే ఇతర కొన్ని యాప్స్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లోనే గ్యాస్ సిలిండ్‌ను బుక్ చేసుకోవచ్చు.
సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే.. రిజిస్టర్ మొబైల్ నెంబర్ నెంబర్ నుంచి కాల్ చేయడం లాంటి ప్రాసెస్ ఉంటుంది. అయితే వాట్సాప్ ద్వారా సింపుల్‌గా గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. మరి గ్యాస్ బుకింగ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం.
హెచ్‌పీ గ్యాస్ కోసం.
- ముందుగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌లో 9222201222 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
- తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి పైన తెలిపిన నెంబర్‌కు 'HP GAS BOOK' అని మెసేజ్ పంపించాలి.
- ఆ తర్వాత వచ్చే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. గ్యాస్ బుక్ కాగానే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
భారత్ గ్యాస్ కోసం
- మీ మొబైల్‌లో 'భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్'కు చెందిన 1800224344 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత చాట్ బాక్స్‌లో నెంబర్‌ను ఓపెన్ చేసి 'BOOK' లేదా '1' నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ కొట్టాలి. వెంటనే ఓ పేమెంట్ లింక్ వస్తుంది.
ఇండేన్ గ్యాస్ కోసం.
- ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లో 7588888824 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
- అనంతరం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి పైన తెలిపిన నెంబర్‌కు Refill<16-digit ID> అనే మెసేజ్ పంపాలి.
- వెంటనే మీ వాట్సాప్‌కు డిజిటల్ పేమెంట్ లింక్ వస్తుంది.
- ఇలా ప్రాసెస్ చేయడం ద్వారా మీరు గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు
0 Response to "Easy way to book gas cylinder on WhatsApp."
Post a Comment