Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let us know what are the benefits of brushing your teeth with neem.

 Neem Stick : వేప పుల్లతో పళ్ళు తోముకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మన పూర్వీకులు వేపపుల్లతో పళ్ళు తోముకునేవారు. ప్రస్తుత కాలంలో వేప పుల్ల వినియోగం తగ్గిపోయింది. ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి.

దీంతో దంత సంబంధిత సమస్యలు ఎక్కువ అయిపోయాయి. బ్రష్ తో పాటు వేప పుల్ల కూడా అప్పుడప్పుడు వినియోగిస్తూ ఉండాలి. దీంతో దంత సమస్యలు రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వేప పుల్లతో నెలకు ఒకసారి అయినా తోముకుంటే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే వేపలో సూక్ష్మజీవులను నివారించే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేప పుల్లతో పళ్ళు తోముకుంటే దాదాపుగా నోట్లో ఉన్న క్రిములు నిర్మూలించబడతాయి.

వేప చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వేపాకులు, వేప పూలు, వేప బెరడు ఇలా అన్నింటిలో ఔషధ గుణాలు ఉంటాయి. వేప పుల్లతో దంతాలు శుభ్రం చేసుకుంటే పటిష్టంగా ఉంటాయి. వేప పుల్లతో బ్రష్ చేయటం వలన దంతాల్లోని బ్యాక్టీరియా చనిపోతుంది. దంతాలు, చిగుళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు. నాలుగు చుక్కల ఆవాల నూనెలో ఉప్పు కలిపి వేప పుల్లతో బ్రష్ చేస్తే దంతాలు శుభ్రమవుతాయి. చిగుళ్ళు బలంగా తయారవుతాయి. దంతాల పసుపు, బలహీనత, నోటి దుర్వాసన, దంతాక్షయం, చీము కూడా వేప పుల్లతో తోముకుంటే పోతుంది. అలాగే నోటిపూత సమస్య ఉన్నా కూడా వేప పూలతో బ్రష్ చేసుకుంటే నయం అవుతుంది. అలాగే కళ్ళు, చెవులు, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వేప పుల్లతో క్రమం తప్పకుండా బ్రష్ చేయటం వలన ముఖం కాంతివంతంగా కూడా తయారవుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వెనుకటి కాలంలో పెద్దలంతా వేప పుల్లతోనే పళ్ళు తోముకునే వారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో వేప పుల్లలు వాడుతున్నారు. పట్టణాలలో వేపచెట్టు ఉన్నా వాటి వద్దకు వెళ్లి తెచ్చుకుని పళ్ళు తోముకునే ఓపిక ఇప్పటి జనాలకు లేదు. కొన్నిసార్లు వేప పుల్లపై పేస్ట్ వేసుకొని తోముకునే ఉత్తములు కూడా ఉన్నారు. అందుకే కొద్దిగా మారాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. టూత్ పేస్ట్ వాటిలో కెమికల్స్ కలుస్తాయి. వాటి వలన దంతాలు బలహీనమవుతున్నాయి. దీంతో చిన్న చిన్న పిల్లల కూడా దంత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలలో ఒకటైన వేపపుల్లను వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let us know what are the benefits of brushing your teeth with neem."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0