If the check bounces, heavy fine, imprisonment.
చెక్ బౌన్స్ అయితే భారీ జరిమానా, జైలుశిక్ష.. చెక్ ఇచ్చే సమయంలో పాటించాల్సిన రూల్స్ వాటి వివరాలు.
మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో చెక్ బౌన్స్ గురించి వినే ఉంటారు. చెక్ జారీ చేసిన తర్వాత ఏదైనా తప్పు చేస్తే చెక్ బౌన్స్ అవుతుంది. మెజారిటీ సందర్భాల్లో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల చెక్ బౌన్స్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
చెక్ బౌన్స్ అయితే కొన్నిసార్లు జరిమానా చెల్లించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం జరిమానాతో పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
చెక్ బౌన్స్ కావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. చెక్ బౌన్స్ అయితే ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా ఛార్జీలను వసూలు చేస్తుంది. చెక్ బౌన్స్ అయితే కొన్నిసార్లు 150 రూపాయల నుంచి 800 రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితులు సైతం ఉంటాయి. గరిష్టంగా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు సైతం ఏర్పడతాయి. చెక్ జారీ చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేసినా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
చెక్ ద్వారా కాకుండా ఆన్ లైన్ లావాదేవీల ద్వారా మాత్రమే వీలైనంత వరకు డబ్బు లావాదేవీలను జరిపితే మంచిదని చెప్పవచ్చు. మన దేశంలో చెక్ బౌన్స్ నేరం కాగా రూల్స్ ప్రకారం చెక్ బౌన్స్ అయిన నెల రోజుల తర్వాత రుణ గ్రహీత చెక్ ను చెల్లించని పక్షంలో అతని పేరుపై లీగల్ నోటీస్ ను జారీ చేసే ఛాన్స్ అయితే ఉంది. నోటీస్ కు సమాధానం ఇవ్వకపొతే చెక్ బౌన్స్ కేసు వేయవచ్చు.
నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం సెక్షన్ 138 కింద కేసును నమోదు చేసే ఛాన్స్ ఉండగా రుణ గ్రహీతపై కేసు నమోదు చేసిన తర్వాత అతనికి జరిమానా విధించడం లేదా జైలు శిక్ష విధించడం లేదా రెండూ విధించడం జరుగుతుంది.
0 Response to "If the check bounces, heavy fine, imprisonment."
Post a Comment