Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Diabetes

 Diabetes: షుగర్ పేషెంట్స్‌కి గుడ్‌న్యూస్... పూర్తిగా నయం చేయొచ్చు.. మందులతో పనిలేదు

పేలవమైన జీవనశైలి కారణంగా చాలామంది ప్రజలు మధుమేహం మారిన పడుతున్నారు. ఇది ఒకసారి వచ్చిందంటే దీని నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం. ఈ వ్యాధి వచ్చినవారు మందులు తీసుకుంటూ, జీవనశైలి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇటీవల ఒక 41 ఏళ్ల మహిళ డయాబెటిస్‌ నుంచి పూర్తిగా బయటపడింది. దశాబ్ద కాలంగా పోరాడుతున్న ఆమె ట్రాన్స్‌ఫర్‌మేటివ్ సర్జరీ (Transformative surgery)తో ఉపశమనం పొందగలిగింది.

ఈ సర్జరీ తరువాత ఆమె డయాబెటిస్ మందులు వాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతోంది. డయాబెటిస్‌ (Diabetes) లేదా మెటబాలిక్ సర్జరీ (Metabolic surgery) అని పిలిచే ఈ సర్జరీని లాపరోస్కోపికల్‌గా పర్ఫార్మ్ చేస్తారు. ఈ సర్జరీలో భాగంగా హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి కడుపు, పేగులను తిరిగి మారుస్తారు.

ఈ సర్జరీ చేయించుకున్న మహిళ పేరు కవితా మహేష్. ఆమె 84.5 కిలోల బరువు ఉంది. హై-కొలెస్ట్రాల్, థైరాయిడ్ సమస్యలు, కిడ్నీ సమస్యల ఫ్యామిలీ హిస్టరీ ఉంది. కొంతకాలంగా రోజూ మందులు వాడుతున్నా, ఆమె రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రాలేదు. చివరికి డయాబెటిస్‌ సర్జరీ చేయించుకుని ప్రాణాలు రక్షించుకోగలిగింది. ముంబైలోని వోకార్డ్ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ డయాబెటిస్ & మెటబాలిక్ సర్జన్ డాక్టర్ రామెన్ గోయెల్ రోగికి చికిత్స అందించారు.

డయాబెటిస్ సర్జరీకి అర్హత

సర్జరీ చేయించుకోవాలనే వారు తప్పనిసరిగా కనీసం 27.5 బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్న పెద్దలు అయి ఉండాలి. అంటే దాదాపు 8-10 కిలోగ్రాముల ఓవర్‌వెయిట్ ఉండాలి. వారికి టైప్-2 డయాబెటిస్‌ ఉండాలి. ప్యాంక్రియాటిక్ పనితీరు, ఇతర ఆరోగ్య పరిస్థితులు, అనస్థీషియా కంపాటిబిలిటీని అంచనా వేయడానికి సమగ్ర పరీక్షలు చేయించుకోవాలి.

సర్జరీ ప్రభావం

డయాబెటిస్ సర్జరీ మధుమేహం రోగులలో కనిపించే డయాబెటిక్ రెటినోపతి, స్ట్రోక్, కిడ్నీ వ్యాధి, గుండె, నరాల సమస్యల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించగలదు. ఈ సమస్యలే భారతదేశంలో అధిక మరణాల రేటుకు కారణమవుతాయి. శస్త్రచికిత్స తరువాత రోగుల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి, రికవరీ కూడా వేగంగా జరిగిపోతుంది. దీనివల్ల ఇన్సులిన్ లేదా ఇతర మధుమేహం మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు.

పెరుగుతున్న ఆందోళన

77% కంటే ఎక్కువ మంది రోగులు వ్యాధిపై తగిన నియంత్రణను సాధించడంలో విఫలమవుతున్నారని, భారతదేశంలో మధుమేహం కేసుల్లో భయంకరమైన పెరుగుదల కనిపిస్తోందని డాక్టర్ రామెన్ గోయెల్ పేర్కొన్నారు. అన్‌కంట్రోల్డ్‌ డయాబెటిస్ వల్ల గుండెపోటులు, స్ట్రోక్స్‌, న్యూరోపతి, నెఫ్రోపతీ వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది.

శస్త్రచికిత్స ప్రయోజనాలు

డాక్టర్ గోయెల్ ప్రకారం, మధుమేహం శస్త్రచికిత్స అనేది అధిక HBA1c స్థాయిలు ఉన్న రోగులకు ఒక మంచి ఎంపిక. ఇది 2-3 నెలల్లో సగటు రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థితికి తీసుకొస్తుంది. ఫలితంగా జీవితకాలం పెరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది.

భారతదేశంలో గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే మెటబాలిక్ సర్జరీలు ఫేమస్ అయ్యాయి. అవి GLP-1 హార్మోన్ విడుదలను ప్రేరేపించడానికి, ఇన్సులిన్‌ను పెంచడానికి, నిరోధకతను తగ్గించడానికి ఆహారాన్ని తిరిగి మారుస్తాయి. సర్జరీకి దాదాపు గంట సమయం పడుతుంది, ఆపై రోగులు నీరు తాగవచ్చు, వెంటనే నడవచ్చు. మధుమేహం మందులను వారంలోపే ఆపివేయవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Diabetes"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0