Green Chillies
Green Chillies : అయ్యో మంట అని తినకుండా ఉండేరు. రీసెర్చ్ చేసి సూపర్ న్యూస్ చెప్పారు
ఏవంట అయినా రుచి రావాలంటే.. అందులో పచ్చి మిర్చి వేయాల్సిందే. నోట్లో దాని ఘాటు తగలకపోతే తిన్నట్లే ఉండదు. ఆహారంలో ఘాటు పెంచేందుకు, ఊరగాయల్లో వీటిని ఉపయోగిస్తుంటారు.
పచ్చి మిరపకాయల్లో విటమిన్ A, B, C పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు కాల్షియం, పాస్పరస్ కూడా లభిస్తాయి. మిర్చి ఉత్పత్తి, వినియోగంలోనూ భారత్‌దే మొదటి స్థానం. చాలా మంది మిర్చిని ఇష్టంగా తింటే మరికొంతమంది మాత్రం బాబోయ్ కారం అంటారు. అయితే వంటల్లో రుచిని పెంచే ఈ పచ్చి మిరపకాయ మీ గుండెకు చాలా మేలు చేస్తుంది. అవును, దీన్ని తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందట.
పచ్చిమిర్చి తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఉదయ్‌పూర్‌లోని పారస్ హెల్త్ కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హితేష్ యాదవ్ చెప్పారు. పరిమిత పరిమాణంలో మిర్చి తినడం ప్రయోజనకరమని డాక్టర్ హితేష్ కూడా చెప్పారు. బరువు తగ్గడం మొదలుకుని అనేక ఆరోగ్య సమస్యలకు మిర్చి సహకరిస్తుందని వివరించారు. మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ మూలకం.. కారంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. మిర్చిపై ఇటీవలి పరిశోధనలు చేసిన తర్వాత, అది గుండెపోటు లేదా స్ట్రోక్‌తో మరణించే అవకాశాలను తగ్గిస్తుందని వెల్లడైంది.
పరిశోధనలో ఏం తేలింది
వారంలో కనీసం నాలుగు సార్లు పచ్చి మిర్చి తింటే గుండె సంబంధిత వ్యాధితో మరణించే అవకాశాలు 44 శాతం తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే సమయంలో, స్ట్రోక్ నుండి మరణించే అవకాశాలు 61 శాతం తగ్గుతాయట. ఇటువంటి అధ్యయనాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ హితేష్ చెప్పారు.
ఇమ్యూనిటీ బూస్టర్
తాజా, పచ్చి మిర్చిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. మిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని కలిగించే ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌ని తగ్గించే శక్తి కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పచ్చిమిర్చీలో ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక రోగాలను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
0 Response to "Green Chillies"
Post a Comment