Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Instructions for Candidates Appearing for sSC Exams

 SSC పరీక్షలకు హాజరగు అభ్యర్థులకు సూచనలు (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, A.P. ప్రకారం) :

Instructions for Candidates Appearing for sSC Exams

1. మీ సమాధానాలను కాగితం పై రెండు వైపులా రాయండి. ప్రశ్న సంఖ్యలను మార్జిన్ లో జాగ్రత్తగా వ్రాయాలి.

2. అవసరమైన చోట రఫ్ వర్క్ తప్పనిసరిగా పేజీ దిగువన చేయాలి. జవాబులను, రఫ్ వర్క్ ను ఒక గీత గీసి వేరు చేసి " రఫ్ వర్క్" అని హెడ్డింగ్ వ్రాయాలి.

3. అదనపు ఆన్సర్ బుక్లెట్ లు అందించబడవు. మీరు జవాబు పుస్తకం నుండి ఏ పేజీని వేరు చేయకూడదు లేదా చింపివేయకూడదు.

4. అభ్యర్థులు ప్రతి పేజీలో మొత్తం 24 లైన్లలో వ్రాయాలి. ప్రతి సమాధానాన్ని క్రొత్త పేజీలో ప్రారంభించాల్సిన అవసరం లేదు.

5. మార్జిన్లో జవాబులు వ్రాయవద్దు. మార్జిన్ లో ప్రశ్న సంఖ్య మాత్రమే వ్రాయాలి. సమాధానాలు స్పష్టంగా నీలం (Blue) లేదా నలుపు (Black) పెన్నుతో మాత్రమే రాయాలి. ఎరుపు (Red) లేదా ఆకుపచ్చ (Green) పెన్నులు ఉపయోగించరాదు.

6. ఆన్సర్ బుక్లెట్ లో లేదా OMR షీట్లో మీ పేరు లేదా హాల్ టికెట్ నంబర్ వ్రాయ కూడదు..

7. మీరు పరీక్ష హాల్లోకి కాగితపు షీట్లు, ముద్రించిన పుస్తకం, వ్రాసిన, టైప్ చేసిన, సైక్లోస్టైల్ చేసిన లేక జిరాక్స్ షీట్లు వంటి ఏదైనా నిషేధించబడిన మెటీరియల్ని తీసుకు రాకూడదు.

8. మీరు అభ్యంతరకరమైన లేదా అశ్లీల భాషలో వ్రాయడం లేదా జవాబు పుస్తకంలో ఏ విధంగానైనా ఎగ్జామినరిని ఉద్దేశించి ఏదైనా రాయడం నిషేధించబడింది. మీరు అలా చేస్తే మీ ఆన్సర్ స్క్రిప్ట్ను వేల్యూ చేయరుమరియు మీ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.

9. పరీక్ష పూర్తయిన వెంటనే మీ ఆన్సర్ బుక్లెట్ ను ఇన్విజిలేటర్ కు అందచేయవలసిన బాధ్యత మీదే.

10. పరీక్ష హాల్లో మీరు ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే చీఫ్ సూపరింటెండెంట్ మిమ్మల్ని బహిష్కరిస్తారు మరియు బోర్డ్ ద్వారా కఠినమైన శిక్షకు కూడా గురవుతారు.

11. ఉదయం 8-45 గంటలకు పరీక్షా కేంద్రం లో ఉండాలి. పరీక్షా కేంద్రమునకు సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్ మొదలైన ఎలక్ట్రానిక్ పరికరములు తేరాదు.

12. OMR షీట్ పై మీ పేరు మరియు ఆ రోజు పరీక్షదే అని నిర్ధారించుకోవాలి. OMR షీట్ లో పార్ట్-I మరియు పార్ట్-II లలో నిర్దేశించిన గడులలో మాత్రమే వ్రాయాలి మరియు "ఫుల్ సిగ్నచర్ అఫ్ ది స్టూడెంట్" క్రింది బాక్స్ లోనే సంతకం చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Instructions for Candidates Appearing for sSC Exams"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0