Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Lost your smartphone. But do this immediately and you will get results.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా. అయితే వెంటనే ఇలా చేయండి ఫలితం ఉంటుంది.

Lost your smartphone. But do this immediately and you will get results.

స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో భారత్‌ ముందు వరుసలో ఉంది. 4G, 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. వ్యక్తిగత అవసరాలు సహా సోషల్‌ మీడియా, బ్యాంకింగ్‌ అవసరాలను కూడా స్మార్ట్‌ఫోన్ల ద్వారా పూర్తిచేస్తున్నారు.

ఒకరకంగా స్మార్ట్‌ఫోన్లు లేకుండా ఏ పని కూడా జరగని పరిస్థితి సుమారుగా వచ్చింది.

కుటుంబం, వ్యక్తిగత మరియు బ్యాంకింగ్‌ వివరాలు అన్ని అందరి స్మార్ట్‌ఫోన్లలో (Smartphone Data Protection) ఉంటున్నాయి. అయితే ఫోన్లు దొంగలించబడడం మరియు పోగొట్టుకున్న పరిస్థితుల్లో అందులో ఉన్న వివరాలు బహిర్గతం అవుతాయని సహజంగా ఆందోళన కలుగుతుంది. అయితే మనం పొగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్ పొరపాటున నేరస్తుల చేతుల్లోకి వెళ్తుందనే ఆందోళన కూడా ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లోని వ్యక్తిగత లేదా ఇతర వివరాలను వారు దుర్వినియోగం చేసే అవకాశం ఉండడం సహా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉంది. అయితే మీరు తాజాగా స్మార్ట్‌ఫోన్‌ను (Safeguard Personal Data From Your Stolen Smartphone) పొగొట్టుకున్నారా.. అయితే మీ హ్యాండ్‌సెట్‌లోని వివరాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారా.. అయితే ఇలా చేశారా..?

సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయాలి : మీరు ఇటీవలే స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నట్లయితే వెంటనే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ వివరాలు సమర్పించి, వెంటనే బ్లాక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా బ్యాంకింగ్‌ సంబంధిత మోసాల బారిన పడకుండా ఉంటాం.

పోలీసులకు ఫిర్యాదు : ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేయడంతోపాటు వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు సమయంలో పోలీసులు కోరిన IMEI నంబర్‌, స్మార్ట్‌ఫోన్‌ పేరు వంటి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఫలితంగా మీ మొబైల్‌ను త్వరగా గుర్తించే వీలు ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌ను లాక్‌ చేయడం : పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌లో Find My Device లేదా Find My iPhone వంటి ఫీచర్లను ఆన్‌ చేసి ఉంటే.. మీరున్న ప్రాంతం నుంచే మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్‌ చేసే వీలుంటుంది. మరియు మీ ఫోన్లో ఉన్న డేటాను డిలీట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా నేరస్థుల చేతుల్లోకి మీ ఫోన్‌ వెళ్లినా.. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఫోన్లు వినియోగిస్తున్న సమయంలో మీ ఫోన్ వివరాలు అంటే IMEI సహా ఇతర వివరాలను ఇతర ప్రాంతాల్లో రాసిపెట్టుకోవాల్సి ఉంటుంది. మరియు ఫోన్‌ లోని Find My Device లేదా Find My iPhone వంటి ఫీచర్ల ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండేలా చూసుకోవాలి. మరియు ఫోన్‌కు ఎల్లప్పుడూ ప్యాట్రన్ లేదా పిన్‌ నంబర్‌తో లాక్‌ చేసుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Lost your smartphone. But do this immediately and you will get results."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0