Notification for free seats in AP private schools - application procedure, important dates.
ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ సీట్లకు నోటిఫికేషన్- దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలివే.
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద, వెనుక బడిన వర్గాల విద్యార్దులకు కేటాయించాల్సి ఉంది. దీని ప్రకారం ఏపీలో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ సీట్ల కేటాయింపు కోసం అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది.
ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఉచిత సీట్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇతర వివరాలను అందుబాటులో ఉంచింది.
ఏపీలోని ప్రైవేటు స్కూళ్లలో ఉచిత సీట్లు పొందేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. ఈ నెల 23 నుంచి మార్చి 14వ తేదీ వరకూ విద్యార్ధులు ఫ్రీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. విద్యాహక్కు చట్టం కింద 2024-25 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఒక ప్రక టనలో తెలిపారు.
ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతి భావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు స్కూళ్లలో ఉచిత సీట్లు కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వీరికి 25 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆయా స్కూళ్లలో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు అర్హత గల విద్యార్థులు తమ ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో http://cse.ap.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.
పూర్తి వివరాలకు విద్యార్ధులు సమీప మండల విద్యాశాఖాధికారి లేదా జిల్లా విద్యాశా ఖాధికారిని గానీ, 18004258599 టోల్ ఫ్రీ నం బరులో గానీ సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ తర్వాత ప్రైవేటు స్కూళ్లతో సంప్రదించి సీట్లు కేటాయిస్తారు.
0 Response to "Notification for free seats in AP private schools - application procedure, important dates."
Post a Comment