Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Student attack on teacher in high school

పురిటీగడ్డ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిపై  విద్యార్థి దాడి

Student attack on teacher in high school

  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన
  • పట్టించుకోని హెడ్మాస్టర్, తోటి ఉపాధ్యాయులు
  • విద్యార్థుల్లో నానాటికి పెరుగుతున్న క్రమశిక్షణారాహిత్యం
  • గ్రామాల్లో సచివాలయ మహిళ పోలీస్ ప్రేక్షక పాత్ర.
  • ఆందోళన ,అవమాన భారంతో ఉపాధ్యాయురాలు.

కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం ,పురిటీగడ్డ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ లో  మహిళా ఉపాధ్యాయిని పై పదవ తరగతి విద్యార్థి అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి  జరిగి నాలుగు రోజులు కావస్తున్న ఇంతవరకు ప్రధానోపాధ్యాయులు కానీ తోటి టీచర్లు గానీ మాట్లాడకపోవడం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాఠశాల అల్లరి అవుతుందనే ఉద్దేశంతో దాన్ని కప్పి పుచ్చుకునే  ప్రయత్నాలు చేయటం వల్ల భవిష్యత్ లో ఇలాంటి తీవ్ర సంఘటనలు ఏమి జరగనున్నాయో అని టీచర్లు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  ఇలాంటి సంఘటనలు వల్ల గ్రామ సచివాలయ పరిధిలో ఇలాంటి అంశాల పర్యవేక్షణ కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ మహిళా పోలీస్ వ్యవస్థయొక్క ఉపయోగం ఏమిటో అని, ఆ వ్యవస్థ పనితీరును ప్రశ్నించేలా ఉంది. గతంలో కూడా సదరు పదవ తరగతి విద్యార్థి ప్రధానోపాధ్యాయుని తో పాటు పలువురు టీచర్లపై  తరగతి గదులలో  విద్యార్థుల ముందు దుర్భాషలాడటం లాంటి  సంఘటనలు చాలా ఉన్నాయని విద్యార్థులకు ,ఉపాధ్యాయులకు తెలిసిన విషయాలే. నానాటికి విద్యార్థుల్లో ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య వైఖరి , ఉపాధ్యాయుల గౌరవానికి మచ్చ తెచ్చేలా ఉంటున్న ఈ తరహా ఘటనలు విద్యార్థులు,ఉపాధ్యాయులు ను  తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాయి.. సున్నితమైన సమస్యలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చూచి చూడనట్లు వ్యవహరించకుండా గ్రామ సర్పంచ్, పెద్దలు, స్కూల్ కమిటీ చైర్మన్, మహిళా పోలీసులు ద్వారా ఈ సమస్య శాశ్వత పరిష్కారం కొరకు పలు  మార్గాలను అన్వేషించాల్సింది పోయి సంఘటన పై నిమ్మకు నిరుత్తినట్లు ఎవరికి వారు తమకు ఎందుకులే తమ మీదకు దాడి చేయలేదు కదా అనేలా వ్యవహరించడం తీవ్ర బాధ్యతా రహిత్యాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ ,విద్యాశాఖ పురిటీగడ్డ ఉన్నత పాఠశాలలో నెలకొన్న పరిస్థితులను పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలని  విద్యార్థులలో క్రమశిక్షణ విద్యాబుద్ధులతో పాటు ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గ్రామస్తులు, విద్యార్థులు కోరుతున్నారు.ఇలాంటి సంఘటనలు మరిన్ని పునరావృతం అయితే చల్లపల్లి మండలం లో ఉన్న ఏకైక ప్రభుత్వ జూనియర్ కాలేజీ గా అనుమతి పొందిన పురిటీగడ్డ హై స్కూల్ ప్లస్ ఉనికే ప్రశ్నర్ధకం అయ్యే అవకాశం ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Student attack on teacher in high school"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0