Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

5 top courses from world no.1 university 'free'. These details can be found

వరల్డ్ నెం.1 యూనివర్శిటీ నుంచి 5 టాప్ కోర్సులు 'ఫ్రీ' .  ఈ వివరాలు తెలుసుకోగలరు

5 top courses from world no.1 university 'free'. These details can be found

ప్రపంచంలోనే నంబర్-1 యూనివర్సిటీ అయిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో చదువుకునే అవకాశం వస్తే ఎవరు అడ్మిషన్ తీసుకోవాలనుకోరు. అది కూడా ఫ్రీ గా అయితే ఎగిరి గంతేస్తారు.

MIT..ఫ్రీ గా 5 టాప్ కోర్సులను ఫ్రీగా అందిస్తోంది. ఆన్‌లైన్ మోడ్‌లో కంప్యూటర్ సైన్స్, మెషిన్ లెర్నింగ్ నుండి డేటా సైన్స్ వరకు 5 కోర్సులను అందిస్తోంది. దీని ట్యుటోరియల్స్ చిన్న వీడియోల రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ ట్యుటోరియల్‌లలో MIT ఉపాధ్యాయులు మాత్రమే బోధిస్తారు. MIT యొక్క ఈ సర్టిఫికేట్ కోర్సులు పూర్తిగా ఉచితం. కానీ ధృవీకరించబడిన సర్టిఫికేట్(verified certificate) కోసం.. ఒక్కో కోర్సుకు 70 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది.

MIT అందించే 5 ఉచిత కోర్సులు

1. పైథాన్‌ని ఉపయోగించి కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్‌ ఇంట్రెడెక్షన్: ఈ కోర్సు తక్కువ ప్రోగ్రామింగ్ అనుభవం లేదా లేని విద్యార్థుల కోసం. సమస్యలను పరిష్కరించడంలో గణన యొక్క పాత్రను అర్థం చేసుకోవడం దీని ఉద్దేశ్యం. ఈ కోర్సులో పైథాన్ 3.5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించబడుతుంది.

2. కంప్యూటేషనల్ థింకింగ్,డేటా సైన్స్ ఇంట్రెడెక్షన్: ఈ కోర్సులో వివిధ టార్గెట్స్ ని సాధించడానికి గణనను ఎలా ఉపయోగించాలో మీకు నేర్పించబడుతుంది. గణన సమస్య(Computational problem)పరిష్కారం గురించి డీటెయిల్డ్ ఇంట్రెడెక్షన్ కూడా ఇవ్వబడుతుంది. ఈ కోర్సు పైథాన్‌లో ప్రోగ్రామింగ్‌లో కొంత అనుభవం ఉన్నవారికి, గణన సంక్లిష్టతపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి ఉద్దేశించబడింది.

3. పైథాన్‌తో మెషిన్ లెర్నింగ్: ఈ కోర్సులో మెషిన్ లెర్నింగ్ ఫీల్డ్ గురించి లోతైన పరిజ్ఞానం లీనియర్ మోడల్స్,పైథాన్ ప్రాజెక్ట్‌ల ద్వారా అందించబడుతుంది.

4. సప్లయ్ చైన్ అనలిటిక్స్: సప్లయ్ చైన్ ఒక సంక్లిష్టమైన వ్యవస్థ. ఇందులో అనేక వ్యాపారాలు,సంస్థలు వివిధ ప్రయోజనాల కోసం పాల్గొంటాయి. ఈ బిజినెస్, మేనేజ్ మెంట్ కోర్సు మీకు వివిధ ఎనలిటికల్ మెథడ్స్,టెక్నాలజీలను పరిచయం చేస్తుంది. తద్వారా సప్లయ్ చైన్ ను చక్కగా రూపొందించవచ్చు,మెయింటెయిన్ చేయవచ్చు.

5. ఎంటర్ ప్రెన్యూర్ గా మారడం(Becoming an Entrepreneur) : ప్రతిష్టాత్మకమైన, విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడానికి అవసరమైన వ్యాపార నైపుణ్యాలు, స్టార్టప్ మైండ్ సెట్ గురించి ఈ కోర్సు మీకు నేర్పుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "5 top courses from world no.1 university 'free'. These details can be found"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0