Are we eating fake eggs? Identification tips
మనం తింటున్నది నకిలీ కోడిగుడ్డు ఏమో? గుర్తించే చిట్కాలివే
ఇపుడు మార్కెట్లలోఫ్క్స్ చాలాచోట్ల నకిలీ కోడిగుడ్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ కోడిగుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్‌తో నకిలీ గుడ్డు పెంకులు తయారుచేస్తారు.
గుడ్డులోని పచ్చసొన, గుడ్డులోని తెల్లసొనను సోడియం ఆల్జినేట్, అల్యూమ్, జెలటిన్, తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు, ఫుడ్ కలరింగ్‌తో తయారు చేస్తున్నారు. నకిలీ గుడ్డును గుర్తించడమెలాగో తెలుసుకుందాము.
- నకిలీ కోడిగుడ్ల పైపెంకు నిజమైన వాటి కంటే మెరుస్తూ ఉంటుంది.
- నకిలీ గుడ్లు నిజమైన గుడ్లు కంటే గట్టిగా ఉంటాయి.
- కోడిగుడ్డును షేక్ చేస్తే షెల్ లోపల నీరులా కదలాడుతున్నట్లుంటే అది నకిలీది.
- గుడ్డును పగలగొట్టిన వెంటనే గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన కలిసిపోతే అది నకిలీ కోడిగుడ్డు.
- నిజమైన గుడ్లు నీసు వాసనను కలిగి ఉంటాయి, అయితే నకిలీ గుడ్లు వాసన లేనివిగా వుంటాయి.
- పాన్‌లో పగులగొట్టి వేసిన కోడిగుడ్డు పచ్చసొన మీరు తాకకుండా వ్యాపిస్తే అది నకిలీ గుడ్డు.
- కోడిగుడ్డు నకిలీదైతే దాని పెంకుకి మంట పెడితే అది కాలుతూ ప్లాస్టిక్ వాసన వస్తుంది, నిజమైనది త్వరగా కాలదు.
- నకిలీ కోడిగుడ్ల వల్ల మెదడు, నరాల నష్టం, కాలేయ వ్యాధులు, రక్త ఉత్పత్తిని ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
0 Response to "Are we eating fake eggs? Identification tips"
Post a Comment