Do not use these tablets at all.
ఈ ట్యాబ్లెట్లు మాత్రం అస్సలు వాడొద్దు.
హైదరాబాద్ నగరంలో నకిలీ మందుల తయారీ గుట్టురట్టు అయింది. మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మార్కెట్లోకి వస్తున్న మెడిసిన్స్ నకిలీవనీ డగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు.
ఆ ట్యాబ్లెట్లలో అసలు మెడిసిన్ లేదని.. చాక్ పౌడర్, గంజితో తయారు చేస్తున్న మెడిసిన్ ని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది. దాదాపు 33 లక్షల విలువైన మెడిసిన్ సీజ్ చేసిన డీసీవి పేర్కొనింది. మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో వచ్చే మెడిసిన్స్ వాడకం ఆపేయాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సూచించింది.
ఈ టాబ్లెట్స్ తో ఆరోగ్యానికి హానికరమన్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు సూచించారు. రిటెయిలర్స్ కూడా ఈ మెడిసిన్ ని డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. కల్తీ మందులు తయారీ చేస్తున్న వారిపై డీసీఏ కేసు నమోదు చేసింది. ఈ మందులను వాడితే హై రిస్క్ ఉంటుందని.. మార్కెట్లో మెగ్ లైఫ్ సైన్సెస్ పేరిట విక్రయించే మందులను కొనొద్దని.. ఎవరైనా ఇప్పటికే కొనుగోలు చేస్తే వాటిని వాడొద్దని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
0 Response to "Do not use these tablets at all."
Post a Comment