No matter how many heights are built. Dandruff will disappear in 5 days. Do this
Dandruff : ఎంత పెచ్చులు కట్టినా సరే. 5 రోజుల్లో చుండ్రు పరార్ అవుతుంది. ఇలా చేయండి
మనల్ని వేధించే వివిధ రకాల జుట్టు సమస్యలల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తుంది. ఈ చిన్న సమస్యతో మనలో చాలా మంది సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు.
ఈ సమస్య నుండి బయటపడడానికి రకరకాల ట్రీట్ మెంట్ లను, షాంపులను, ఇంటి చిట్కాలను వాడుతూ ఉంటారు. అయినప్పటికి ఈ సమస్య నుండి బయటపడలేకపోతుంటారు. అయితే అవగాహన లోపం వల్లే ఈ సమస్యతో బాధపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన శరీరం వ్యర్థాలను, వివిధ రకాల లవణాలను, విష పదార్థాలను చెమట రూపంలో బయటకు పంపిస్తుంది. మనం పని చేసేటప్పుడు శరీరం చల్లబడడానికి శరీరమంతా చెమట పడుతుంది. అదేవిధంగా తలలో కూడా చెమట పడుతుంది.
అయితే మనం రోజూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటాము. కానీ తలను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే శుభ్రం చేసుకుంటాము. తలలో ఉన్న చెమట కొంత సమయానికి ఆవిరైపోతుంది. నీరు ఆవిరై పోయి చెమటలో ఉండే వ్యర్థాలు తల చర్మంపై పేరుకుపోతాయి. అలాగే తల చర్మం కణాలు ప్రతిరోజూ కొన్ని చనిపోతూ ఉంటాయి. ఇలా నశించిన చర్మ కణాలు, అలాగే చెమటలో ఉండే వ్యర్థాలు, ట్యాక్సిన్స్ అన్ని పేరుకుపోయి తల చర్మంపై అట్టలాగా పేరుకుపోతాయి. ఇదే చుండ్రులా మారిపోతుంది. దీనికి గాలిలో ఉండే బ్యాక్టీరియాలు చేరి నిల్వ ఉండి వాటి సంతతిని వృద్ది చేసుకుంటాయి. దీంతో ఆ భాగంలో ఇన్పెక్షన్ వచ్చి దురద వస్తుంది. తలను రోజూ శుభ్రం చేసుకోకపోవడం వల్ల తలలో ఉండే వ్యర్థాలే చుండ్రుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
0 Response to "No matter how many heights are built. Dandruff will disappear in 5 days. Do this"
Post a Comment