Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for pensioners: Government has issued orders increasing DR by 4 percent. The purpose is very descriptive

 పెన్షనర్లకు గుడ్ న్యూస్ డీఆర్ ను 4 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల . ప్రయోజనం ఎంతో వివరణ.

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. వీరికి డీయర్నెస్ రిలీఫ్ (డీఆర్)ను 4 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీని ద్వారా వీరికి వస్తున్న పింఛన్ సొమ్ము పెరుగుతుంది.

డీయర్నెస్ రిలీఫ్ ను కరువు భత్యం అని పిలుస్తారు. ఇవి పెన్షన్ లో కలిపి ఉంటుంది. ఏడాదికి రెండుస్లారు అంటే జనవరి, జూన్ నెలల్లో డీఆర్ ను ప్రకటిస్తారు. సాధారణంగా నిత్యావసరాల ధరలు స్థిరంగా ఉండవు. వారి నెలవారీ పెరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ కింద పనిచేసే ఒక విభాగంగా ఈ పెరిగిన ధరలను పరిశీలించి, కేంద్రానికి నివేదిక అందజేస్తుంది. ఆ ధరల ప్రకారం డీఆర్ ను పెంచుతారు.

ఎంతో ప్రయోజనం.

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీయర్నెస్ రిలీఫ్ ను 4 నుంచి పెంచారు. పెంచిన రిలీఫ్ 2024 జనవరి 1 నుంచి లెక్కిస్తారు. మార్చి 19న విడుదలైన ఉత్తర్వుల ప్రకారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) ఈ క్రింది వారికి పెరిగిన డీఆర్ ను అందజేయనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, దానికి పరిధిలోని అన్ని విభాగాల్లో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు, ఇప్పటికే పెన్షన్ పొందుతున్నవారికి కుటుంబ సభ్యులందరికీ దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ కింద తెలిపిన వారందరికీ డీఆర్ పెరుగుదల వర్తిస్తుంది.

పౌర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లు, పీఎస్ యూ/స్వయంప్రతిపత్తి సంస్థలలోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు.

సాయుధ దళాల పెన్షనర్లు, వారి కుటుంబ పెన్షనర్లు, పౌర పెన్షనర్లు, వారి కుటుంబ పెన్షనర్లకు డిఫెన్స్ సర్వీస్ అంచనాల నుంచి చెల్లిస్తారు.

ఆల్ ఇండియా సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు.

రైల్వే/కుటుంబ పెన్షనర్లు.

బర్మా పౌర పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లు, బర్మా/పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రభుత్వ పెన్షనర్లు, కుటుంబాలు.

ఉద్యోగి కుటుంబ పెన్షనర్లు, తిరిగి ఉపాధి పొందిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు నిబంధనలకు అనుగుణంగా డీఆర్ పెంచుతారు. ఒక వ్యక్తి అనేక పెన్షన్లను పొందుతుంటే నియంత్రణ చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటారు.

ఎంత పెరుగుతుందంటే.

సాధారణంగా డీఆర్ పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల నెలవారీ పెన్షన్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి నెలకు రూ.40,100 ప్రాథమిక పెన్షన్‌గా పొందుతున్నాడు. అందులో రూ. 18,446 డీఆర్ అందుకుంటున్నాడు. ఇటీవల 4 శాతం పెరగడం వల్ల అతడికి నెలకు రూ. 20,050 డీఆర్ లభిస్తుంది. దీంతో అతడి నెలవారీ పెన్షన్ మరో రూ.1,604 పెరుగుతుంది. త్వరలో పెన్షనర్లందరూ పెరిగిన మొత్తాలను అందుకోనున్నారు. జాతీయ బ్యాంకులతో సహా పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలన్నీ డీఆర్ ను లెక్కించడంలో సహాయ పడతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for pensioners: Government has issued orders increasing DR by 4 percent. The purpose is very descriptive"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0