Have you given your aadhaar card to anyone..? But the process of checking history.
Aadhaar Card : మీరు ఎవరికైనా మీ ఆధార్ కార్డు ఇచ్చారా..? అయితే హిస్టరీ చెక్ చేసుకొనే విధానం.
ప్రస్తుతం ఎలాంటి జాబ్ చేయాలన్నా.. దేనికైనా అప్లై చేయాలన్న.. బయటికి వెళ్ళాలి అన్న.. ఇలా ఏ పని చేయాలన్న.. ఆధార్ కార్డు తప్పనిసరి అన్న విషయం మనందరికీ తెలిసిందే..
మొదట్లో కేవలం దీనిని గుర్తింపు కార్డుగా తీసుకున్నారు. ఇక తర్వాత ప్రతిదానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని నిర్ణయించారు. సిమ్ కార్డు తీసుకోవాలన్న.. అకౌంట్ ఓపెన్ చేయాలి అన్న.. అడ్రస్ ప్రూఫ్ గా ఇలా ప్రతిదానికి ఆధార్ తప్పనిసరి చేయడం జరిగింది. అయితే సైబర్ క్రైమ్ కూడా ఇలానే పెరిగిపోతున్నాయి. మనకి తెలియకుండానే మన ఆధార్ కార్డు మీద వందలు సిమ్స్ తీసుకోవడం చేస్తుంటాం. అలాగే తెలియని అకౌంట్స్ ఓపెన్ చేయడం కూడా చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా మన ఆధార్ కార్డు మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం.
కాబట్టి ఒకసారి మీరు మీ ఆధార్ కార్డు హిస్టరీని ఇలా చెక్ చేసుకోవటం మంచిదని చెప్తున్నారు. 2010లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తీసుకురావడం జరిగింది. ఇక అది భారతీయులకు ఒక ముఖ్యమైన తప్పనిసరి కార్డుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కొన్ని స్కీములు అలాగే సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ప్రధానమైన ఏ పనికైనా ఆధార్ కార్డు తప్పకుండా కావాలని చెప్తారు. ఈ నేపథ్యంలోని సైబర్ క్రైమ్ ఫ్రాడ్ చేసేవాళ్ళు సంక్షేమ పథకాలను దొంగతనంగా దోచుకోవాలి అనుకునేవాళ్ళ.. అమాయకుల్ని మోసం చేయడం జరుగుతుంది. కొంతమంది ఆధార్ కార్డు హిస్టరీ గురించి తెలియదు.. కావున ఒకసారి మీ ఆధార్ కార్డు మిస్టరీని ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మీకు అన్ని వివరాలు దీనిలో తెలుస్తాయి. అయితే అసలు ఆధార్ కార్డు చెకింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హిస్టరీ తెలుసుకొనే విధానం
- ముందుగా మీ ఆధార్ ఆధారికా వెబ్సైట్ www.uidai.com వెబ్సైట్ లోకి వెళ్ళాలి.
- తర్వాత యుఐడిఏఐ వెబ్సైట్లో వెడమవైపు మై ఆధార్ అనే ఆప్షన్ లో ఉండే ఆధార్ సర్వీస్ పై క్లిక్ చేయాలి.
- కింద స్క్రోల్ చేశాక ఆధార్ అదేంటికషన్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
- ఇక తర్వాత మిమ్మల్ని ఒక కొత్త పేజీ లోకి రీ డైరెక్టర్ చేస్తుంది కొత్త పేజీలో లాగిన్ అయ్యేందుకు ఆధార్ నెంబర్ క్యాప్చ కోడు, ఓటిపి నంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత కింద స్క్రోల్ చేసిన అతేంటికేషన్ హిస్టరీ కనబడుతుంది. ఈ అతేంటికేషన్ హిస్టరీలో ఆల్ మీద క్లిక్ చేసి డేట్ పైన సెలెక్ట్ చేసుకుని పెట్టుకుని హిస్టరీ మీద క్లిక్ చేసుకోవాలి.
- ఇక తర్వాత మీరు మీ ఆధార్ అతంటీకేషన్, ఓటిపి, డెమోగ్రఫీ, బయోగ్రఫీతో ఆధార్ ని లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఎక్కడెక్కడ వాడారు వివరాలన్నీ ఈజీగా తెలిసిపోతాయి.. ఇలా తెలుసుకోవడం వల్ల మీరు మీ ఆధార్ కార్డు ని ఎవరెవరికి ఇచ్చారు. ఎన్ని చోట్ల వాడారు. అనే విషయాలు మీకు సులభతరంగా తెలిసిపోతాయి. ఎవరైనా హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు.
0 Response to "Have you given your aadhaar card to anyone..? But the process of checking history."
Post a Comment