Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

You can check if the name is there in the voter list or not

Voter List : ఓటరు జాబితాలో పేరు ఉందో. లేదో. ఇలా చెక్ చేసుకోగలరు

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓటర్ల తన వజ్రాయుధమైన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే.. మీకు ఓటు హక్కు ఉన్నా.

ముందుగా ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి. జాబితాలో మీ పేరు ఉంటేనే మీరు ఓటు వేయగలరు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద కూర్చొని ఆన్‌లైన్ లో ఓటరు జాబితాలో మీ పేరును చూసుకోవచ్చు.

ఓటరు జాబితాలో పేరును ఎలా తనిఖీ చేయాలి 

ఆన్ లైన్ ద్వారా.

  • ఇందుకోసం.. ముందుగా https://nvsp.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • ఇక్కడ ఎలక్టోరల్ రోల్‌పై క్లిక్ చేయండి.
  • వెంటనే కొత్త వెబ్‌పేజీ తెరుచుకుంటుంది. అక్కడ మీ ఓటర్ ఐడి వివరాలను నమోదు చేయాలి.
  • ఇందులో పేరు, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, రాష్ట్రం , జిల్లా మొదలైన వివరాలు ఉంటాయి.
  • దీని తర్వాత క్రింద ఇవ్వబడిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సర్చ్ పై క్లిక్ చేయండి.
  • అదే పేజీలో EPIC నంబర్, స్టేట్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాల్సిన మరొక లింక్‌ని పొందుతారు.
  • ఆ తర్వాత కొత్త ట్యాబ్ తెరుచుకుని ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
  • SMS ద్వారా చెక్ చేసుకోండిలా.
  • దీని కోసం మీరు మీ ఫోన్ నుండి టెక్స్ట్ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది.
  • EPIC అని టైప్ చేసి.. ఓటర్ ID కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. 
  • అప్పుడు ఈ సందేశాన్ని 9211728082 లేదా 1950కి పంపండి.
  • దీని తర్వాత మీ నంబర్‌కు ఓ మెసేజ్ వస్తుంది. అందులో మీ పోలింగ్ నంబర్, పేరు వ్రాయబడుతుంది.
  • ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే మీకు ఎలాంటి సమాచారం అందదు.

హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా.

అదే విధంగా..హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం టోల్-ఫ్రీ నంబర్‌ 1950కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్)ప్రకారం.. మీకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం ప్రాంప్ట్ కాల్‌ను అనుసరించి 'ఓటర్ ఐడీ స్టేటస్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఐవీఆర్ చెప్పినట్టు.. EPIC ఓటర్ ఐడీ నంబర్‌ ఎంటర్ చేయాలి. ఈ నంబర్‌ ఎంట్రీ తర్వాత మీ ఓటర్ ఐడీ స్టేటస్ ఏంటనేది తెలుస్తుంది.

ఎన్నికల సంఘం సూచన:

ఓటు వేయాలంలే ఓటరు జాబితాలో పేరు తప్పనిసరిగా ఉండాలి. ఓటర్ జాబితాలో పేరు ఉండి.. ఓటరు ఐడీ కార్డు లేకపోయినా ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా గుర్తింపు కార్డును చూపిస్తే.. ఓటు వేయటానికి అనుమతి ఇస్తారు. కానీ, జాబితా పేరు లేకపోతే మాత్రం ఓటు వేయడం కష్టం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "You can check if the name is there in the voter list or not"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0