Details of AP High Court dismissing the shock petition for pensioners.
పెన్షనర్లకు షాక్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు వివరాలు.
పెన్షనర్లకు ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
వాలంటీర్ల విషయంలో ఈసీ చర్యలను హైకోర్టు సమర్థించింది. పెన్షన్ల పంపిణీకి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా ఏపీ సీఎస్ హైకోర్టుకు తెలిపారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ విధుల నుండి ఈసీ తొలగించింది.
ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. దీంతో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పెన్షనర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో మాదిరిగానే వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈసీ చర్యలను సమర్థిస్తూ పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్ను తోసి పుచ్చింది. మరోవైపు ప్రభుత్వం ఇవాల్టి నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయల్లో లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తుంది.
0 Response to "Details of AP High Court dismissing the shock petition for pensioners."
Post a Comment