Do you know what is 1 ton, 1.5 ton in AC? Which one to select?
ACలో 1 టన్, 1.5 టన్ అంటే ఏంటో తెలుసా? ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి?
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఇళ్లలో ఏసీలు ఆన్ లో ఉంటాయి. కొంతమంది అయితే ఈ ఉక్కపోతని తట్టుకోలేక కొనేస్తుంటారు. అయితే మీరు గమనిస్తే ఏసీల్లో రకాలు ఉంటాయి.
1 టన్ ఏసీ అని.. 1.5 టన్ ఏసీ అని.. 2 టన్ ఏసీ అని ఇలా ఏసీల్లో రకాలు ఉంటాయి. మరి ఏసీల్లో ఉంటే ఈ టన్ అంటే ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా? టన్ అంటే ఏసీ కూలింగ్ కెపాసిటీని లెక్కించేది. ఇది మీ రూమ్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక గంటలో గదిలో ఉన్న వేడిని ఎంతవరకూ తరిమికొడుతుందన్న దాని మీద ఈ టన్ అనే కొలమానం ఆధారపడి ఉంటుంది. వేడిని బ్రిటిష్ థర్మల్ యూనిట్ లో (BTU) కొలుస్తారు.
ఒక టన్ ఏసీ 12 వేల బ్రిటిష్ థర్మల్ యూనిట్ల వేడి గాలిని తొలగిస్తుంది. అదే 2 టన్ ఏసీ యూనిట్ అయితే 24 వేల బీటీయూ వేడిని తొలగిస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. 24 గంటల్లో 1 టన్ అంటే 2,220 పౌండ్ల ఐస్ ని కరిగించడానికి 1 టన్ ఏసీ యూనిట్ అవసరమవుతుంది. ఈ కూలింగ్ సామర్థ్యాన్ని బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ లో లెక్కిస్తారు. మీ ఇంట్లో ఉన్న ఏసీ 1 టన్ ఆ? లేక 2 టన్ ఆ అనేది తెలుసుకోవాలంటే మోడల్ నంబర్ మీద గానీ ఏసీ యూనిట్ లేబుల్ మీద గానీ చూస్తే తెలిసిపోతుంది. మోడల్ నంబర్ మీద టన్ కి సంబంధిత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉదాహరణకు మీ ఏసీ యూనిట్ ఒక టన్ అయితే కనుక 12,000 BTU అని.. 1.5 టన్ అయితే కనుక 18,000 BTU అని ఉంటుంది. ఎంత ఎక్కువ టన్ ఏసీ యూనిట్ అయితే ఎంత ఎక్కువ కూలింగ్ నిస్తుందని అర్థం.
ఎంత కెపాసిటీ ఏసీని సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
మరి మన ఇంటికి ఏ టన్ ఏసీ యూనిట్ సెట్ అవుతుంది. ఎంత కెపాసిటీ ఉన్నది సెట్ అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా సింపుల్. మీ గది ఎన్ని చదరపు అడుగులు ఉందో దాన్ని 25తో గుణించండి. వచ్చిన నంబర్ ఏదైతే ఉందో అది.. మీ గది చల్లబడటానికి ఎన్ని నంబర్ ఆఫ్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ అవసరమో చెబుతుంది. ఆ వచ్చిన నంబర్ ని 12 వేలతో భాగిస్తే మీ గదికి అవసరమైన టన్ కెపాసిటీ అనేది వస్తుంది. ఒక గదిలో ఐదుగురు వ్యక్తులు ఉంటే కనుక ఆ రూమ్ కి 0.5 టన్ ఏసీ యూనిట్ అనేది కనీస అవసరం. మీ గది పరిమాణం 100 నుంచి 130 చదరపు అడుగులు ఉంటే కనుక 0.8 టన్ నుంచి 1 టన్ ఏసీ సరిపోతుంది. 130 నుంచి 200 చదరపు అడుగులు ఉంటే కనుక 1.5 టన్ ఏసీ సరిపోతుంది. 200 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉంటే కనుక 2 టన్ ఏసీ తీసుకోవాలి. అదే 500 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న రూమ్ అయితే కనుక ఒకటి కంటే ఎక్కువ ఏసీలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా లెక్కించండి
- 0.8 టన్ ఏసీ - 9000 BTU
- 1 టన్ ఏసీ - 12000 BTU
- 25 టన్ ఏసీ - 15,000 BTU
- 1.5 టన్ ఏసీ - 18,000 BTU
- 2 టన్ ఏసీ - 24,000 BTU
- గది పరిమాణం X 25 BTU = గది BTU
- 110 చదరపు అడుగులు X 25 = 2650 BTU (ఇది ఒక వ్యక్తి లెక్క)
అదనంగా మనుషులు ఉంటే ఒక్కో వ్యక్తికి 600 నుంచి 700 BTU అనేది అవసరమవుతుంది. ఉదాహరణకు నలుగురు ఉంటే 2400 నుంచి 2800 BTU అవసరమవుతుంది. అంటే మొత్తం మీద 5,450 BTU అనేది అవసరమవుతుంది. అంటే కనీసం 0.8 టన్ ఏసీ తీసుకోవాల్సి ఉంటుంది. గది సైజ్ పెరిగితే BTU పెరుగుతుంది. దాన్ని బట్టి ఏసీ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఏసీ కొనుక్కోవాలనుకునేవారు ఈ లెక్కలు పాటించండి. ఈ కథనం మీకు ఉపయోగకరమని అనిపిస్తే షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
0 Response to "Do you know what is 1 ton, 1.5 ton in AC? Which one to select?"
Post a Comment