Flax Seeds For Face Beauty
Flax Seeds అందాన్ని పెంచే అవిశ గింజలు. ఎలా వాడాలో వివరణ.
Flax Seeds For Face Beauty : అందంగా ఉండాలని ఎవరికి ఉండదు ? పైగా వేసవి కాలంలో ముఖం ఊరికే టాన్ అయిపోతుంటుంది. ఎండలో తిరగడం వల్ల ముఖం నల్లబడిపోతుంది కూడా.
అందంగా కనిపించాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అవిసె గింజలతో కూడా ముఖం అందాన్ని పెంచుకోవచ్చని మీకు తెలుసా ? ఇప్పుడు తెలుసుకోండి. మొటిమలు, మచ్చలు, ముడతలు కూడా తగ్గుతాయి. మరి వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దామా.
అవిసె గింజల్ని జుట్టు పెరుగుదలకు ఎక్కువగా వాడుతుంటారు. అలాగే అవిసె గింజలను తినడం వల్ల ఆర్థరైటిస్ సమస్యలు తగ్గుతాయి. డయాబెటీస్, కొలెస్ట్రాల్ కూడా తగ్గుముఖం పడతాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అవిసె గింజల్ని ఉడికించగా వచ్చే జెల్ ను ఫేస్ ప్యాక్ గా కూడా వాడుకోవచ్చు. నానబెట్టిన అవిసె గింజల్ని నీటిలో వేసి 2-3 నిమిషాలు ఉడికిస్తే.. ఒక జెల్ వస్తుంది. దీనిని గిన్నెలోకి తీసుకుని.. చల్లారిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని అప్లై చేసుకోవాలి. అది ఆరిన తర్వాత మరో లేయర్ జెల్ ను అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అయ్యాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా అవిసె గింజల జెల్ ను ముఖానికి రాయడం వల్ల ముఖంపై ఉండే దద్దుర్లు, మచ్చలు, మొటిమలు, వాపు, ఎర్రగా ఉండటం వంటివి తగ్గుతాయి.
అవిసె గింజలు ఎగ్ తో కలిపి వేసుకునే మరో ప్యాక్.. చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. ఇందుకోసం అవిసె గింజల్ని పొడి చేసుకోవాలి. ఒక గుడ్డులో ఈ పొడిని వేసి చర్మానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత కడిగితే.. చర్మం శుభ్రమవుతుంది. ట్యాన్ తొలగిపోతుంది. అలాగే నాలుగు గంటలపాటు నానబెట్టిన అవిసె గింజల్ని రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ చేసి.. ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే.. ముఖం మెరుస్తుంది. ఇలా అవిసె గింజలతో ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే.. ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.
0 Response to "Flax Seeds For Face Beauty"
Post a Comment